తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం - ఒకేరోజు సప్త వాహనాలపై తిరుమలేశుడి దర్శనం.!!

|
Google Oneindia TeluguNews

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం. ఒకే రోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఏడు వాహనాల్లో తిరుమలేశుడు మాడ వీధుల్లో విహరించనున్నారు. ఈ నెల 28న రధసప్తమి కోసం తిరుమలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తరువాత వచ్చే మాఘ శుద్ధ సప్తమి రోజును రథసప్తమిగా వేడుకలు నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. మాఘమాసంలో మాఘ శుద్ధ సప్తమిని ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు పుట్టిన రోజుగా భావిస్తారు. రధ సప్తమి అయిన సూర్య జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి క్షేత్రంలో రథ సప్తమి వేడుకలను అత్యంత ఘనంగా టీటీడీ సమాయత్తం అవుతోంది. మినీ బ్రహ్మోత్సవాలుగా ఆ రోజు నిర్వహించే సేవలను పరిగణిస్తారు.

రధ సప్తమి నాడు కన్నుల పండుగగా

రధ సప్తమి నాడు కన్నుల పండుగగా

ఈ నెల 28న తిరుమ‌ల‌లో రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను ఖరారు చేసారు. ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం పైన స్వామి వారి ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం పైన మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహణకు నిర్ణయించారు. ఈ రెండు వాహనాల సేవలు తరువాత ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

సూర్య జయంతి నాడు మాడ వీధుల్లో

సూర్య జయంతి నాడు మాడ వీధుల్లో

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ఫిబ్రవరి నెలలో తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు

ఫిబ్రవరి నెలలో తిరుమలలో ప్రత్యేక కార్యక్రమాలు

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలోవిశేషఉత్స‌వాలను టీటీడీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి నాడు, అదే విధంగా.. ఫిబ్ర‌వ‌రి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం, ఫిబ్రవరి 10న కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి.. ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం కావటంతో ప్రత్యేకంగా టీటీడీ కార్యక్రమాలను ఖరారు చేసింది.

English summary
TTD Making arrangements for Radhaaptami celebrations at Tirumala on 28th of this month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X