తిరుమలలో ముగిసిన ఉత్సవాలు, వేసవిలో హ్యాపీ, శ్రీవారి అన్ని సేవలకు గ్రీన్ సిగ్నల్!
తిరుమల/తిరుపతి: తిరుమలలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కనుల పండుగగా జరుగుతాయి, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవడానికి భారతదేశంతో పాటు విదేశాల్లో ఉన్న హిందువులు పోటీ పడుతుంటారు. అలాంటి తిరుమలలో హిందూ సాంప్రధాయం ప్రకారం జరిగే కార్యక్రామాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం సోమవారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సోమవారం సాయంత్రం 5 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఆ సమయంలో శ్రీవారి భక్తులు పులకించిపోయారు.

అంతకు ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీత, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. స్వామివారిని దర్శించుకోవాడినికి భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు.
ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు రసరమ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. హారతి అనంతరం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం శ్రీపద్మావతి అమ్మవార్ల పరియోణత్సం ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
హిందూ సంప్రధాయం ప్రకారం, ఎప్పటిలాగే జరిగిన శ్రీ పద్మావతి పరియోణత్సం వేడుకలు ఉద్యానవనాల్లో కుర్చున్న భక్తులు ఎంతో భక్తి శ్రద్దతలతో చూస్తూ పులకించిపోయారు. తిరుమలలో జరిగే ఉత్సవాలను చూడటానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. శ్రీపద్మావతి పరియోణత్సవాలు విజయవంతం కావడంతో భక్తులతో పాటు టీటీడీ ఉద్యోగులు చాలా సంతోషిస్తున్నారు.












Click it and Unblock the Notifications