తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలేజీలో కామాంధుడు.. స్టూడెంట్స్‌తో నీచంగా మాటలు, పుణ్యక్షేత్రం..

|
Google Oneindia TeluguNews

ఆ టీచర్ వక్రబుద్ది చూపించాడు. అవును విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. టీటీడీ ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ సురేంద్ర విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేసే వాడు. వాటిని మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్తానని, పరీక్షలు సరిగా రాయకపోయినా 70 మార్కులు వేస్తానని అమ్మాయిలను లోబర్చుకునే ప్రయత్నం చేశాడు.

సస్పెండ్

సస్పెండ్

కళాశాల ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సురేంద్రను సప్పెండ్ చేశారు. సురేంద్ర ఇలా సస్పెండ్ కావడం ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో ఇలా సురేంద్ర సస్పెన్షన్‌‌కు గురయ్యాడు. కామాంధుడు సురేంద్ర ఆగడాలు టీటీడీ ఓరియంటల్ కాలేజీ పరువు తీసేలా ఉన్నాయని పలువురు వాపోయారు. తిరుపతి ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథంను కఠినంగా శిక్షించాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.

లైంగిక వేధింపులు

లైంగిక వేధింపులు

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. దీనిపై స్పందించిన అధికారులు.. ప్రిన్సిపాల్, వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్ సురేంద్ర, వార్డెన్ రామనాథం అసభ్యకరంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు వారం రోజుల కింద టీటీడీ అధికారులను ఆశ్రయించారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని టీటీడీ ఆదేశించింది. టీటీడీ ఆదేశాల మేరకు నిజనిర్ధారణ చేపట్టిన కమిటీ.. ప్రిన్సిపాల్, వార్డెన్ లైంగిక వేధింపులు నిజమని తేల్చడంతో అధికారులు ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

దిశ చట్టం

దిశ చట్టం

లైంగికంగా వేధించిన ప్రిన్సిపాల్, వార్డెన్లపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని విద్యార్థినులు, మహిళా సంఘాలు కాలేజీ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. విచారణ ఇంకా కొనసాగుతుందని.. పూర్తి కాగానే చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెప్పారు. స్టూడెంట్స్‌తో ప్రిన్సిపల్, అటెంటర్ తీరు సరిగా లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉన్నత స్థానంలో ఉండి ఇలా చేయడం ఏంటీ అని ఆలోచిస్తున్నారు.

English summary
ttd oriental college surendra audio leaked. he his harassed students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X