TTD: తిరుమలలో శ్రావణ రద్దీ - 25న వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనాలంటే..!!

Tirumala: తిరుమలలో శ్రావణ రద్దీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతానికి విశిష్టత ఉంది. దీంతో, తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 25వ తేదీ శుక్ర‌వారం వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. నేరుగా, వర్చువల్ గా భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఈ రోజు నుంచి ఆన్ లైన్ లో టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు.

అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 25వ తేదీ శుక్ర‌వారం ఆస్థానమండపంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

TTD plans to organise grand celebrations of Sri Varalakshmi Vratam at Sri Padmavati temple

ఈ వ్ర‌తాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. భక్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు ఆగ‌స్టు 18వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. అదేవిధంగా ఆల‌యం వ‌ద్ద గ‌ల కుంకుమార్చన కౌంటర్‌లో ఆగస్టు 24 వ తేదీ ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000/- చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు.

వర్చ్యువల్.. నేరుగా హాజరు: ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 18న ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. వ‌ర్చువ‌ల్ టికెట్లు పొందిన భ‌క్తులకు ఆగ‌స్టు 26వ తేదీ నుండి 90 రోజులలోపు అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు.

ఈ కారణంగా అభిషేకం, వ‌స్త్రాలంక‌ర‌ణ సేవ‌, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టీటీడీ రద్దు చేసింది. ఇటు తిరుమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శనంలో కల్పించిన వెసులుబాటు తో భక్తులు దివ్య దర్శనం కోసం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటున్నారు.

TTD plans to organise grand celebrations of Sri Varalakshmi Vratam at Sri Padmavati temple

తగ్గిన నడకదారి భక్తులు: తిరుమల నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. చిన్నారుల పై చిరుతల దాడుల కారణంగా నడక మార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. 15 ఏళ్ల లోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తరువాత నడకమార్గంలో అనుమతించటం లేదు. దీంతో చాలా మంది బస్సుల్లో తిరుమల చేరుకుంటున్నారు.

గత నిత్యం 15 వేల వరకు భక్తులు కాలి నడకన వెళ్లే వారి సంఖ్య ఉండేది. ఇప్పుడు 8 వేల వరకు మాత్రమే కాటి బాటలో భక్తులు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. భక్తుల భద్రత కోసం రక్షణ చర్యలు కొనసాగిస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+