Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో టైట్ సెక్యూరిటి, వైకుంఠం క్యూకాంప్లెక్స్, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ !

తిరుమల/తిరుపతి: కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమల పుణ్యక్షేత్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది. అత్యాధునిక స్కానర్లు, సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఇటీవల ఖమ్మంకు చెందిన ఓ భక్తుడు రహస్యంగా శ్రీవారం ఆలయం ఆవరణంలో వీడియో తీసిన విషయం తెలిసిందే.

ఈ సందర్బంలో శ్రీవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిటమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది.
ఆధునిక టెక్నాలజి సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు.

TTD: The Home Department has decided to set up security in Tirumala with the latest technology.

తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించామని హరీష్ కుమార్ గుప్తా మీడియాకు చెప్పారు. సీసీటీవీ కంట్రోల్ రూమ్ లో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్ వేర్లు ఉపయోగించాలి అనే అంశాలపై అధ్యయనం చేస్తామని హరీష్ కుమార్ గుప్తా అన్నారు. అదేవిధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, బాడీ స్కానర్స్ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని హరీష్ కుమార్ గుప్తా తెలిపారు.

డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఏస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తారని, మరోసారి సమావేశమై సమీక్షిస్తామని డీఐజీ అమ్మిరెడ్డి వివరించారు.

TTD: The Home Department has decided to set up security in Tirumala with the latest technology.

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామని డీఐజీ అమ్మిరెడ్డి అన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర ప్రాంతాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి భద్రతా అంశాలను తనిఖీ చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో తిరుమలలో సీసీటీవీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు.

టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఓఎస్డీ ఐఎస్ డబ్ల్యు శశిధర్ రెడ్డి, టీటాడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సుమిత్, గ్రేహౌండ్స్ ఎస్పీ బిందుమాధవ్, 14వ బెటాలియన్ కమాండెంట్ జగదీష్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ-2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, వీజీవోలు బాలిరెడ్డి, మనోహర్‌, గిరిధర్‌రావు, జీఎం ఐటీ సందీప్ తోపాటు సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TTD: The Home Department has decided to set up security in Tirumala with the latest technology.

అన్నమయ్య భవన్ లో మీటింగ్:తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, ఇంటెలిజెన్స్ ఎస్పీ సుమిత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్క్వాడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీసు, అటవీ, అగ్నిమాపక, ఇతర బలగాలకు చెందిన పలువురు అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+