Tirumala Darshan Tokens: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) ఆన్ లైన్ లో విడుదల చేసింది. జూలై 12, 15, 17 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 7 గురువారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే శుక్రవారం సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
భక్తుల రద్ధీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే శని, ఆదివారాలంటే కాస్త తక్కువగానే ఉంది. భక్తుల రద్దీతో పాటు శ్రీవారు హిండీ ఆదాయం కూడా పెరుగుతోంది. గత ఆదివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా ఒక్కరోజే 6 కోట్ల 18 లక్షల రూపాయల మేర రెవెన్యూ హుండీ ద్వారా లభించింది. ఈ స్థాయిలో హుండీ ఆదాయం రావడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో పది సంవత్సరాల కిందట నమోదైన ఒక్కరోజు రికార్డుస్థాయి హుండీ ఆదాయం తెరమరుగైంది.

10 ఏళ్ల తర్వాత
2012 ఏప్రిల్ 1వ తేదీన లభించిన టీటీడీకి హుండీ ద్వారా అందిన ఒక్కరోజు ఆదాయం 5 కోట్ల 73 లక్షల రూపాయలు. ఇప్పుడది తెరమరుగైంది. కాగా- నాలుగు నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలను అధిగమిస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ప్రతి నెలా హుండీ రెవెన్యూ వంద కోట్ల రూపాయలను దాటుతోంది. మార్చిలో 128 కోట్ల రూపాయలు, ఏప్రిల్‌లో 127.50 కోట్ల రూపాయలు, మేలో 130.50 కోట్ల రూపాయల హుండీ ఆదాయం రికార్డయింది. జూన్‌లో కూడా 123.76 కోట్ల రూపాయలు అందాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications