TTD: శ్రీవారి ఆర్జిత సేవా, దర్శన టికెట్ల కోటా విడుదల - షెడ్యూల్ ఇలా..!!
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వీటి విడుదలకు నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది.ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది. జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అదే నెలకు సంబంధిచి సేవలతో పాటుగా దర్శన కోటా ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
టికెట్ల కోటా విడుదల:శ్రీవారి దర్శనం...సేవలకు సంబంధించి టికెట్ల కోటా విడుదలకు టీటీడీ నిర్ణయించింది. ముందుగా షెడ్యూల్ ఖరారు చేసిన టీటీడీ నిర్దేశిత తేదీల్లో తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది.

భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
సేవలు..దర్శనం టికెట్లు:కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అదే విధంగా.. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ:టీటీడీ అధికారిక వెబ్ సైట్ తో పాటుగా యాప్ లో ఈ టికెట్లను పొందవచ్చు. యాత్రికులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇక, తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పులు కొనసాగుతున్నాయి.
శ్రీవారి ఆలయంలో వెండి వాకిలి నుంచి ఒకే క్యూ లైన్ లో దర్శనం ద్వారా టీటీడీ తాజాగా చేసిన ప్రయోగం ఫలించింది. ఈ నిర్ణయం కారణంగా రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీకే మిశ్రా, ఏపీ తాత్కాలిక సీజే ఏవీ శేషసాయి, న్యాయమూర్తి రవినాథ్ తిల్హరి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారి శ్రీవారిని దర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications