Who killed babai: జగన్‌పై టీడీపీ చిట్టచివరి అస్త్రం: నేను రెడీ..నువ్వు రెడీయా: వైసీపీ కౌంటర్

తిరుపతి: తిరుపతి లోక్‌సభ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణను ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. ఇంకో రెండు రోజుల్లో ఉప ఎన్నిక పోలింగ్‌. ఈ పరిస్థితుల్లో అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడం టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఈ వీడియోలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అయాచిత అస్త్రంలా మారింది. అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ వైసీపీ నేతలు ఘాటు విమర్శలు సంధిస్తున్నారు.

 హు కిల్డ్ బాబాయ్..

హు కిల్డ్ బాబాయ్..

దీనికి కౌంటర్ అటాక్‌ను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. హు కిల్డ్ బాబాయ్ (Who killed babai) అస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని తిరుపతి ఉప ఎన్నిక ప్రచారాస్త్రంగా మార్చుకుంది. వైఎస్ వివేకా హత్యోదంతంపై ఒకవంక కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ తన విచారణను కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. వైఎస్ వివేకా హత్య వెనుక ఆయన కుటుంబీకులే ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోంది.

ప్రమాణం చేయడానికి నారా లో్కేష్ రెడీ..

ప్రమాణం చేయడానికి నారా లో్కేష్ రెడీ..

హు కిల్డ్ బాబాయ్ అంశంపై ప్రమాణం చేయడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ రెడీ అయ్యారు. వివేకా హత్యలో తమ ప్రమేయం ఏమీ లేదనే విషయంపై ప్రమాణం చేయడానికి తాను రెడీగా ఉన్నానంటూ ఇదివరకే నారా లోకేష్ ప్రకటించారు. ఇదే సవాల్‌ను వైెఎస్ జగన్‌కు విసిరారు. వైఎస్ వివేకా హత్యలో తనకు, తన కుటుంబ సభ్యులకు సంబంధం లేదని తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామి సాక్షిగా వైఎస్ జగన్ ప్రమాణం చేయాలంటూ ఇదివరకు నారా లోకేష్ సవాల్ విసిరారు. దీనికోసం తాను రెడీగా ఉన్నానని, నువ్వెక్కడ ఉన్నావంటూ ఆయన జగన్‌కు ప్రశ్నించారు.

ప్రమాణం చేయకపోతే..

ప్రమాణం చేయకపోతే..

వెంకన్న సాక్షిగా వైఎస్ జగన్ ప్రమాణం చేయకపోతే.. వైఎస్ వివేకా హత్యలో జగన్ ప్రమేయం ఉందని నిరూపితమౌతుందని నారా లోకేష్ ఆరోపిస్తోన్నారు. ప్రమాణం చేయడానికి ఆయన రాకపోతే వివేకాను హత్య చేయించింది అబ్బాయే అనే విషయం ప్రపంచానికి అర్ధమవుతుందని చెప్పారు. ప్రమాణం చేయడానికి నిర్దేశించిన రోజే తిరుపతిలో నిర్వహించ తలపెట్టిన ఎన్నికల ప్రచార బహిరంగ సభను వైఎస్ జగన్ రద్దు చేసుకున్నారని, సవాల్ నుంచి పరారయ్యారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది.

పోలింగ్‌ ముంగిట్లో..

పోలింగ్‌ ముంగిట్లో..


తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ముంగింట్లో తెలుగుదేశం పార్టీ.. వైఎస్ వివేకా హత్యోదంతాన్ని తెర మీదికి తీసుకుని రావడం వ్యూహాత్మకమే. ఇప్పటిదాకా ఈ స్థాయిలో టీడీపీ ఈ అంశాన్ని రాజకీయం చేయలేదు. తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ జీవన్మరణంగా భావిస్తోంది. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా.. వైసీపీని ఇబ్బందులకు గురి చేసే ఏ ఒక్క అంశాన్ని కూడా వదులుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా కనిపించట్లేదని, అందుకే వైఎస్ వివేకా హత్యోదంతం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేది టీడీపీ వ్యూహమని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+