Chevireddy Bhaskar reddy : చెవిరెడ్డి కుటుంబంలో విషాదం- తండ్రి ఆకస్మిక మృతి..!
తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యం నిన్న అర్ధరాత్రి చనిపోయారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న అకస్మాత్తుగా తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి(మణి రెడ్డి) అకాల మృతి ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మణిరెడ్డి గత కొంత కాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి హఠాత్తుగా ఊపిరి పీల్చడంలో ఇబ్బంది కలగడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్విమ్స్ కు తరలించారు.
ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

మెరుగైన సేవలు అందించినా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న మణిరెడ్డి మృతి చెందినట్లు స్విమ్స్ వైద్యులు ప్రకటించారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి హఠాత్తుగా కుప్పకూలి పోయారు. గతంలో పీసీసీ కార్యదర్శిగా పనిచేసిన మణిరెడ్డి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తుమ్మలగుంటలో భార్య, తనయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మనవళ్ళతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మణిరెడ్డికి ముగ్గురు కుమారులు.. కాగా అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కుమారుడు. చెవిరెడ్డికి పితృ వియోగం గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు పరామర్శించారు. సీఎం జగన్ కూడా చెవిరెడ్డిని పరామర్శించనున్నారు.












Click it and Unblock the Notifications