వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆవుమాంసాన్ని పీకల్దాకా మెక్కిన రోహిత్ శర్మ: మెనూలో పంది మాసం కూడా: కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగ

|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఒక్కసారిగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుమంది క్రికెటర్లు వివాదాలకు కేంద్రబిందువులయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి అమలు చేస్తోన్న బయో బబుల్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆరుమంది టాప్ క్లాస్ క్రికెటర్లు ఐసొలేషన్‌కు తరలి వెళ్లాల్సి వచ్చింది. మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌లో వారు సుష్టుగా భోజనం చేయడం, ఈ సందర్భంగా ో అభిమానిని రిషబ్ పంత్ ఆలంగనం చేసుకున్న ఘటన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

రెస్టారెంట్‌లో ఆవు, పందిమాంసంతో విందు..

కొత్త ఏడాదిని పురస్కరించుకుని భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, నలుగురు తోటి క్రికెటర్లతో కలిసి మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లాడు. ఓపెనర్లు పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్, వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్, ఫాస్ట్ బౌలర్ నవదీప్‌ సైనీ ఆ సమయంలో అతనతో ఉన్నారు. డిన్నర్‌లో వారు ఆవు, పంది మాంసాన్ని భుజించినట్లు తేలింది. దీనికి సంబంధించిన రెస్టారెంట్ బిల్లు.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. సంచనలంగా మారింది.

రోహిత్ శర్మ అండ్ కంపెనీ ఏఏ ఆహార పదార్థాలను ఆర్డర్ ఇచ్చిందంటే..

మెల్‌బోర్న్‌లోని రెస్టారెంట్‌లో డిన్నర్ సందర్భంగా రోహిత్ శర్మ, అతనితో ఉన్న యంగ్ క్రికెటర్లు.. అన్నీ నాన్ వెజ్ వంటకాలనే ఆర్డర్ చేశారు. రొయ్యలు, పందిమాంసం, ఆవుమాంసం, స్టిర్ ఫ్రైడ్ బీఫ్, బీన్ సాస్, పుట్టగొడుగులు, కోడిమాంసంతో తయారు చేసిన ఫ్రైడ్ రైస్, డైట్ కోక్.. వంటివి ఉన్నాయి. ఇతర ఆహార పదార్థాల గురించి పెద్దగా పట్టింపు లేనప్పటికీ.. బీఫ్‌ను మెనూలో చేర్చడం పట్ల దుమారం రేగుతోంది. మిగిలిన ఆటగాళ్లతో పోల్చుకుంటే.. రోహిత్ శర్మ ఒక్కడి చుట్టే ఈ వివాదం తిరుగుతోంది.. దీనికి కారణం.. అతని కులం... శర్మ అనే పేరు.

శర్మా జీ కా బేటా.. బీఫ్ ఖాతా హై అంటూ..

ఈ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. రోహిత్ శర్మ మీద అభిమానులు మండిపడుతున్నారు. మాంసానికి దూరంగా ఉండే సామాజిక వర్గానికి చెందిన రోహిత్ శర్మ.. నాన్ వెజ్‌ను తినడాన్ని తప్పు పట్టలేమని, ఆవు/ఎద్దు మాంసాన్ని భుజించడాన్ని సమర్థించలేకపోతున్నామని అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తింటే తిన్నారు గానీ.. దాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో ఆ బిల్లును పోస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు పండగే..

ప్రస్తుతం విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ అభిమానుల మధ్య కేప్టెన్సీ వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీని కేప్టెన్‌గా తొలగించి.. అతని స్థానంలో రోహిత్ శర్మను నియమించాలంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తోంది. తొలి టెస్ట్ ఘోర పరాజయం అనంతరం ఈ చర్చ మరింత హోరెత్తుతోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల పట్ల విరాట్ కోహ్లీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ తాజాగా ఈ వివాదంలో చిక్కుకోవడం పట్ల కోహ్లీ ఫ్యాన్స్ హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Twitterati erupted as Team India fans thrashed Rohit Sharma, Rishabh Pant and other players for beef consumption as the bill of their recent visit to a restaurant was shared on social media. The food bill was also shared on social media platforms. Thus, Team India fans noticed beef consumption by the players.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X