బీచ్‌లో పాడుపడి.. చిక్కిన 8 జంటలు.. ఎక్కడ అంటే
బీచ్ అంటేనే.. కేరింత, ఉల్లాసం, ఉత్సాహం కలగలిపి ఉంటాయి. అక్కడ చిన్న, చిరు వ్యాపారులకు ఉపాధి కూడా లభిస్తోంది. అయితే కొన్నిచోట్ల బీచ్ పేరుతో కూడా వ్యభిచారం జరుగుతుంది. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి.. తమ రాసలీలలు సాగిస్తున్నారు.
మంగినపూడి బీచ్‌లో స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు యూజ్ అవుతున్నాయి. యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు కొనసాగించే వారికి, వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు చేరుతున్నారు. బందరు రూరల్ పోలీసులు రిసార్ట్‌పై చేసిన దాడిలో అనేక జంటలు పోలీసులకు చిక్కారు. రిసార్ట్ నడిపే వ్యక్తి మచిలీపట్నంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గదులను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సంపాదనే ధ్యేయంగా వారు తమ కార్యకలాపాలను యదేచ్చగా కొనసాగిస్తున్నారు.

ఆ గదుల్లో గంటకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ నిర్వాకానికి పూనుకుంటున్నట్లు చెబుతున్నారు. రిసార్ట్‌లో నిర్వాకంపై కచ్చితమైన సమాచారంతోనే బందరు రూరల్ ఎస్సై కె వై దాస్ సిబ్బందితో కలిసి మెరుపుదాడి చేశారు. పోలీసులు రిసార్ట్‌పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు తీయగా మరి కొందరు రూంలలోని బాత్‌రూమ్‌లలోకి వెళ్లి దాక్కున్నట్లు తెలిసింది. వారిని కూడా చివరికీ పట్టుకున్నారు. ఇలా ఎనిమిది జంటలు చిక్కారని పోలీసులు తెలియజేశారు.
రూమ్‌లలో కొన్ని కుటుంబాలు సైతం ఉండటంతో విషయం అర్థమైన పోలీసులు వారిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వివరాలు సేకరించి పంపించారు. అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను పోలీసు జీపులో బందరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులకు చిక్కిన వారిలో కొంత మంది ప్రముఖులు, మరి కొందరు ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న వారు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి మంగినపూడి బీచ్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications