కొత్త అల్లుడికి 300 రకాలతో విందు భోజనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల సంక్రాంతి పండగ వైభవంగా కొనసాగుతోంది. భోగితో ఆరంభమైన సంక్రాంతి వేడుకలు.. నేడు కనుమతో ముగియనున్నాయి. కనుమను ప్రజలు ఘనంగా జరుపుకొంటోన్నారు. భక్తిశ్రద్ధలతో పశువులను పూజిస్తోన్నారు. ప్రత్యేకించి- పల్లెల్లో కనుమ సందడి నెలకొంది.
సంక్రాంతి పండగకు అల్లుళ్లు.. అత్తవారింటికి రావడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. అల్లుళ్లకు తమ మర్యాదలతో ఉక్కిరిబిక్కరి చేస్తుంటారు అత్తారింటోళ్లు. గత సీజన్‌లో అత్తారింటివారు కొత్త అల్లుడికి చేసిన మర్యాదలు.. ఇప్పటికీ మర్చిపోవట్లేదు ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజలు.

గత ఏడాది సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి 173 వంటకాలతో మర్యాద చేశారు. అప్పట్లో ఆ విందు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి సందర్భాలు విశాఖపట్నం, కృష్ణాజిల్లాల్లో చోటు చేసుకున్నాయి. అల్లుళ్లకు అతిథి మర్యాదలు చేయడంలో తమను మించినవారు లేరని మరోసారి నిరూపించుకున్నారు కోస్తా తీర ప్రజలు.
సంక్రాంతి సందర్భంగా ఇంటికి వచ్చిన అల్లుడికి 300 రకాల వంటకాలతో విందుభోజనాన్ని వడ్డించారు అనకాపల్లికి చెందిన అత్తింటివాళ్లు. అనకాపల్లిలో నివసించే బియ్యం వ్యాపారి కూతురు రిషితకు విశాఖపట్నానికి చెందిన దేవేంద్రకు ఇచ్చి గత ఏడాది పెళ్లి జరిపారు. పెళ్లి తరువాత మొదటి సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చిన దేవేంద్రకు 300 రకాల వంటకాలతో ఆతిథ్యాన్ని ఇచ్చారు.
కొత్త అల్లుడికి 300 రకాలతో విందు భోజనం#sankranthi2024, #festival, #food, #Krishna pic.twitter.com/CRnq9X1PzH
— oneindiatelugu (@oneindiatelugu) January 16, 2024
ఇలాంటి ఉదంతమే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిట్టూర్పు గ్రామానికి చెందిన జీ సాయినాథ్ కుటుంబం 250 రుచులతో కూడిన వంటకాలను తమ ఇంటి అల్లుడికి వడ్డించారు. నూతన దంపతులు రేవంత్- నవ్యకు మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చారు.












Click it and Unblock the Notifications