బెజవాడ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించిన వైఎస్ జగన్: అరుదైన ఘటనలు
విజయవాడ: రాష్ట్ర చరిత్రలో రెండు అరుదైన ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాష్ట్రం క్షేమం, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ మరుసటి రోజే విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసిన కనక దుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.
రెండు రోజుల తన తిరుమల పర్యటనను ముగించుకున్న వైఎస్ జగన్.. ఈ ఉదయం తిరుమల నుంచి రేణిగుంటకు రోడ్డు మార్గంలో బయలుదేరారు. 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కొద్దిసేపు విరామం తీసుకున్న అనంతరం ఆయన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి వెళ్లారు.
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు.

దుర్గమ్మ సన్నిధికి చేరుకున్న వైఎస్ జగన్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమను సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మూలా నక్షత్రం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి చేరుకున్నారు వైఎస్ జగన్. ఆయన వెంట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా చుట్టారు.

Recommended Video
పట్టు వస్త్రాలు, పసుపు-కుంకుమను తలపై ధరించి వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కనక దుర్గమ్మ సన్నిధికి చేరుకున్నారు. సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో వైఎస్ జగన్‌కు ఆశీర్వచనాలు పలికారు. తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. అనంతరం తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications