Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గన్నవరం విమానాశ్రయ భూముల కౌలుపై అశ్వనీదత్ పిటీషన్ విచారణ.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతుల నుండి భూసేకరణ జరిగిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన 700 ఎకరాల భూములను గత టిడిపి ప్రభుత్వం సేకరించి ఎయిర్పోర్ట్ అథారిటీ అప్పగించింది. మొదట భూములు ఇవ్వటానికి నిరాకరించిన అమరావతి రైతులకు ఇచ్చే విధంగా ప్యాకేజీ ఇస్తామని రైతులకు ప్రతి ఏటా కౌలు కూడా ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, రైతులకు భూమికి సంబంధించి కౌలు ఇవ్వడంలేదని గత కొంత కాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన వారికి వార్షికకౌలు ఎందుకు చెల్లించడం లేదు

విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన వారికి వార్షికకౌలు ఎందుకు చెల్లించడం లేదు

సినీ నిర్మాత అశ్వనీదత్ దంపతులు తమ 39 ఎకరాల భూమి కూడా గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఇచ్చారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం కౌలు చెల్లించడం లేదని అశ్వనీదత్ దంపతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా సోమవారంనాడు పిటిషన్ పై విచారణ జరిగింది. ఇక నేడు కూడా మరో మారు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. నిన్న హైకోర్టులో జరిగిన విచారణలో విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన వారికి వార్షిక కౌలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

కౌలు చెల్లించాల్సిన బాధ్యత మీదే.. ఎప్పటిలోగా చెల్లిస్తారు

కౌలు చెల్లించాల్సిన బాధ్యత మీదే.. ఎప్పటిలోగా చెల్లిస్తారు

కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హైకోర్టు తేల్చి చెప్పింది. సాంకేతిక కారణాలతో జాప్యం చేయడానికి వీలు లేదని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇలాంటి వైఖరి వల్లనే పౌరులు ఇబ్బంది పడుతున్నారని, పౌరులు ఇబ్బంది పడడానికి వీలు లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇక గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన వారికి ఎప్పటిలోగా కౌలు చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూ శాఖను హైకోర్టు ప్రశ్నించింది. ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ ఆయన సతీమణి వినయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు కూడా విచారణ జరపనున్న హైకోర్టు ధర్మాసనం రెవిన్యూ శాఖ సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని వ్యాఖ్యానించింది.

 నేడు కూడా విచారణ.. ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందో!

నేడు కూడా విచారణ.. ధర్మాసనం ఏం నిర్ణయం తీసుకుంటుందో!

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. మరి హైకోర్టులో నేడు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం భూములు ఇచ్చిన ఈ వ్యవహారంలో విచారణ జరపనున్న నేపధ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఏం సమాధానం చెప్పబోతుంది? హైకోర్టు ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+