అచ్చెన్నకు సీఎం జగన్ బంపరాఫర్ - టీడీపీ ప్రతిపాదనలకు అంగీకారం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. దీంతో..సభా నిర్వహణ పైన స్పీకర్ తమ్మినేని బీఏసీ సమావేశం ఏర్పాటు చేసారు. ప్రభుత్వం నుంచి సీఎం జగన్ తో సహా శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన..బీఏసీలో సభ్యులుగా ఉన్న మంత్రులు హాజరయ్యారు. కాగా, టీడీపీ నుంచి అచ్చన్నాయుడు హాజరయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.

టీడీపీ ప్రతిపాదనలపై చర్చకు సిద్దం

టీడీపీ ప్రతిపాదనలపై చర్చకు సిద్దం

అధికార వైసీపీ నుంచి 27 అంశాలపైన చర్చకు బీఏసీలో ప్రతిపాదించగా, టీడీపీ నుంచి 17 అంశాల పైన చర్చ చేయాలని స్పీకర్ ను కోరింది. తెలుగు దేశం నుంచి ప్రతిపాదించిన అన్ని అంశాల పైన చర్చకు సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మద్యం స్కాం పైన వస్తున్న ఆరోపణల పైన చర్చకు సిద్దమని ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే, సభ సజావుగా జరిగేలా సహకరిస్తే..తాము అన్ని అంశాల పైన చర్చకు సిద్దమేనని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇక, వైసీపీ నుంచి పరిపాలనా వికేంద్రీకరణతో పాటుగా.. పోలవరం.. సంక్షేమం.. వ్యవసాయ రంగం పైన చర్చ చేయాలని కోరింది.

మూడు రాజధానుల పై సీఎం క్లారిటీ

మూడు రాజధానుల పై సీఎం క్లారిటీ

ఇక, ఈ రోజున సభలో కీలకమైన ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల పరిపాలనా వికేంద్రీకరణతో పాటుగా జిల్లాల పునర్విభజన అంశం పైన స్వల్ప కాలిక చర్చ జరగనుంది. ఇందులో సీఎం జగన్ పాల్గొంటారని సమాచారం. మూడు రాజధానుల ఆలోచన వెనుక కారణాలు.. అమరావతిలోనే మొత్తం ఖర్చు చేస్తే.. ఇతర ప్రాంతాల పై ప్రభావం గురించి సీఎం వివరించనున్నట్లుగా సమాచారం. దీంతో.. ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థ నుంచి రాజధానుల వరకు పూర్తిగా పారదర్శకంగా ప్రజలకు పరిపాలనా వికేంద్రకరణ ద్వారా మేలు చేయటమే లక్ష్యమని సీఎం స్పష్టం చేయనున్నారు. అదే విధంగా..హైదరాబాద్ తరహాలో అన్నింటికీ ఒకే చోట కేంద్రీకరిచంటం ద్వారా భవిష్యత్ లో ప్రాంతీయ అసమానతలు తలెత్తే అవకాశాలపై వివరించనున్నారని సమాచారం.

అచ్చెన్నాయుడుకు సీఎం క్లాస్

అచ్చెన్నాయుడుకు సీఎం క్లాస్

అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులను ప్రతిపాదించినట్లుగా ముఖ్యమంత్రి వివరించనున్నారు. బీఏసీ సమావేశంలో భాగంగా.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయాలని కోరారు. దీనికి స్పందించిన సీఎం..అన్ని అంశాలపై చర్చకు తాము సిద్దమని చెప్పారు. చర్చకు సహకరిస్తారా లేదా అనేది చెప్పాలన్నారు. టీడీపీ కోరే ప్రతీ అంశం పైనా చర్చిస్తామని చెప్పారు. ఈఎస్ఐ స్కాం తో పాటుగా రాజధాని ఇష్యూ పైనా తాము చర్చకు సిద్దమన్నారు. సభలో పద్దతి ప్రకారం చర్చకు వస్తే..అన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అదే సమయంలో మంత్రులు సైతం జోక్యం చేసుకొని సభ జరగనీయకుండా అడ్డుకుంటూ.. అన్ని అంశాలు చర్చకు రావాలని కోరుతున్నారని చెప్పారు. దీనికి సీఎం .. ప్రభుత్వం ఏ చర్చకు అయినా..ఏ అంశం పైన సమాధానం చెప్పటానికైనా సిద్దంగా ఉందంటూ మరోసారి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+