వైసీపీ నేతల ఆగడాలు సీఎం జగన్‌కు కనిపించవా..? ఎంపీడీవోపై దాడిని ఖండించిన చంద్రబాబు

నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో పై ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేశారని వస్తున్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. విధి నిర్వాహణలో ఉన్న మహిళ అధికారిపై ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. దాడి చేయడంపై న్యాయం చేయాలని అర్థరాత్రి సమయంలో పోలీసులను ఆశ్రయిస్తే... కేసు నమోదు చేసేందుకు పోలీసులు భయపడడం అంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళలని కూడ చూడకుండా వారిపై దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎంపీడివో ఇంటికి కరెంట్‌తో పాటు నీటీ కనెక్షన్‌ను కట్ చేసి చెత్తకుండి పెట్టి వేధింపులకు గురి చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. ఇక వైసీపి నేతలు చేస్తున్న అగడాలు ముఖ్యమంత్రి జగన్‌కు కనిపించవా అంటూ ధ్వజమెత్తారు.

 chandrababu naidu condemned attacked on the venkatachalam mandal mpdo.

నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం రాత్రీ అనుచరులతో కలిసి ఇంటిపై దాడి చేశారని ఎంపీడివో సరళ అరోపించారు. దీంతో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు ఆమే అర్థరాత్రి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే కేసును తీసుకునేందుకు ఎవరు అందుబాటులో లేకపోవడంతో ఆమే వెనుదిరిగారు. కాగా ఇదంతా మీడియాలో రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో దిగివచ్చిన పోలీసులు ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+