విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Kanna Lakshminarayana: రాహుల్ గాంధీని కోతితో పోల్చిన కన్నా: తా చెడ్డ కోతి.. అంటూ సెటైర్లు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రజలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తున్నారు. నిరసన ప్రదర్శనలను చేపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపేమీ కాదు.

పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!పౌరసత్వ చట్టం వల్ల ఉపయోగం ఉందా?: సుప్రీంలో కమల్ హాసన్ పిటీషన్..!

పలు రాష్ట్రాల్లో నిరసనలు..

పలు రాష్ట్రాల్లో నిరసనలు..

దేశ ఈశాన్య ప్రాంతంలోని అస్సాం, త్రిపుర, మేఘాలయా, ఉత్తర్ ప్రదేశ్, న్యూఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తున్నారు విద్యార్థులు. పౌరసత్వ సవరణ చట్టం నిరసన సెగల ప్రభావం గానీ, వ్యతిరేక ప్రదర్శనల జ్వాలలు గానీ మన రాష్ట్రంలో పెద్దగా కనిపించట్లేదు.

తొలిసారిగా స్పందించిన ఏపీ బీజేపీ..

తొలిసారిగా స్పందించిన ఏపీ బీజేపీ..

ఇదిలావుండగా- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు చెలరేగిన తరువాత.. ఆ అంశంపై భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్రశాఖ తొలిసారిగా స్పందించింది. ఆ స్పందన కూడా కాస్త ఘాటుగానే కనిపిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఏపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తా చెడ్డ కోతి..

తా చెడ్డ కోతి..


రాహుల్ గాంధీని కోతితో పోల్చారు. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తరువాత రాహుల్ గాంధీ పరిస్థితిని చూస్తోంటే జాలేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాహుల్ గాంధీ వైఖరి.. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందనే సామెతను గుర్తుకు తెస్తోందని వ్యాఖ్యానించారు.

మిడిమిడి జ్ఞానంతో..

మిడిమిడి జ్ఞానంతో..

రాహుల్ గాంధీ తన మిడిమిడి జ్ఞానంతో పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మైనారిటీలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫలితంగా- దేశ భద్రతకు, సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలను వివరంగా చదువుకో రాహుల్ బాబూ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.

ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం..

పౌరసత్వ సవరణ చట్టంలో పొందుపరిచిన కొన్ని అంశాలను ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఆయా అంశాలను అర్థం చేసుకోవడానికి పెద్దగా పరిజ్ఞానమేమీ అవసరం లేదని చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చేస్తోన్న ఆందోళనలు దేశ భద్రతకు ప్రమాదకరమని, ముస్లింలను రెచ్చగొట్టే వైఖరిని మానుకోవాలని హితవు పలికారు.

English summary
Citizenship Amendment Act protest row, Rahul Gandhi behave like monkey, allegedly BJP Andhra Pradesh State President Kanna Lakshminarayana. A first reaction from BJP AP State leaders after amid protesting over the CAA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X