ఇప్పటికి దీనితో సరిపెట్టుకోండి: ఫ్రీ బస్సు ప్రయాణం తరువాత చూద్దాం
Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి ఈ క్యాంటీన్‌ను ప్రారంభించారు.
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటయిన తొలి క్యాంటీన్ ఇదే. అందుకే చంద్రబాబే లాంఛనంగా ప్రారంభించడానికి పూనుకున్నారు. అనంతరం స్వయానా వడ్డించారు. గుడివాడ మున్సిపల్ పార్క్ వద్ద ఈ క్యాంటీన్ ఏర్పాటైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పలువురు టీడీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజున అంటే ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 99 అన్న క్యాంటీన్లు ఆరంభం కానున్నాయి. కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు.. అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.
తమ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీలను సైతం ఇచ్చిన విషయం తెలిసిందే. వాటి పునరుద్ధరణకు సంబంధించిన ప్రతిపాదనలపై చంద్రబాబు తొలి సంతకం చేశారు కూడా.
అన్నా క్యాంటీన్ల కాన్సెప్ట్‌ను తమిళనాడు తొలిసారిగా అమలు చేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయిదు రూపాయలకు ఉదయం టిఫిన్, 10 రూపాయలకు మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మ క్యాంటీన్లు పేరుతో వాటిని ఏర్పాటు చేసింది అప్పట్లో.

దీన్ని 2018లో చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో అమలు చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల అవి మూతపడ్డాయి. దీన్ని పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి.
మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయణాన్ని కూడా ఆగస్టు 15వ తేదీన అమలు చేస్తామంటూ గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అది తాత్కాలికంగా వాయిదా పడినట్టే. తెలంగాణలో ఈ పథకం అమలును అధ్యయనం చేయాల్సి ఉందని చంద్రబాబు ఇదివరకే స్పష్టం చేశారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఇప్పుడు తిప్పండి చక్రం..!! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications