ఏపీ దశ తిరుగుతోంది: వైఎస్ జగన్ హయాంలో క్యూ- కొద్దిరోజుల వ్యవధిలో..!!
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు క్యూ కట్టాయి. మొన్నటికి మొన్న కడప జిల్లాలోని గండికోట, తిరుపతి, విశాఖపట్నం జిల్లా అన్నవరంలల్లో ఓబెరాయ్ హోటల్స్ నిర్మాణానికి వైఎస్ జగన్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. అవన్నీ సెవెన్ స్టార్ హోటల్స్.
ఇప్పుడు తాజాగా ప్రతిష్ఠాత్మకమైన హయత్ హోటల్స్ ఏపీలో ఏర్పాటు కాబోతోన్నాయి. విజయవాడ గుణదలలో నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను వైఎస్ జగన్ కొద్దిసేపటి కిందటే ప్రారంభించారు. ఫైవ్ స్టార్ హోటల్ ఇది. హోటల్ చైర్మన్ వీరస్వామి, హయత్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏరియా అధ్యక్షుడు శ్రీకాంత్, వీరస్వామి తనయుడు కార్తీక్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం వైఎస్ జగన్ మాట్లాడారు. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటకరంగంలో అగ్రగామిగా నిలపడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హోటల్స్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని, పెట్టుబడి పెట్టేవారికి అవసరమైన రాయితీలను కల్పిస్తామని చెప్పారు.
విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇలాంటి హోటల్స్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు. దీనికోసం ప్రత్యేకంగా పర్యాటక పాలసీని అమలు చేస్తోన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోటల్స్ స్థాపించే సంస్థలను ప్రోత్సహించడానికి పలు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తోన్నామని చెప్పారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఒబేరాయ్ హోటల్స్ రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒబేరాయ్, హయత్ ప్లేస్ వంటి సెవెన్, ఫైవ్ స్టార్ హోటళ్లు.. మొత్తం 11 వరకు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు కానున్నాయని అన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, వారందరూ ముందుకు రావాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, పోర్ట్స్, ఐటీ, ఆటోమొబైల్.. వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి పలు రాయితీలను ప్రకటించామని ఆయన గుర్తు చేశారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications