తమ్మినేనిపై ఫిర్యాదు .. తమ్మినేని సీతారాం స్పీకరా ? లేకా బ్రోకరా ? అన్న కాంగ్రెస్ మహిళా నేత

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల ఆలయం ప్రవేశం, డిక్లరేషన్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యల పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన తమ్మినేని సీతారాం సోనియాగాంధీలాగా జగన్‌కు దొంగ సభ్యత్వాలు లేవని, జగన్ ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన వ్యక్తి అని వ్యాఖ్యలు చేశారు. అసలు తమ నాయకుడిని ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. దొంగ పౌరసత్వం ఉన్న సోనియాగాంధీతో చేతులు కలిపి..... అంటూ నీచంగా వ్యాఖ్యానించారు.

ఇక సోనియాగాంధీపై తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఫిర్యాదు చేశారు. తమ్మినేని సీతారాం స్పీకరా రా లేక బ్రోకరా అంటూ ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆయనపై విరుచుకుపడ్డారు. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏమిటని, ఆయన భాష పై మండిపడ్డారు.

Complaint against Thammineni Sitaram .... Is he Speaker? or Broker? Congress female leader fire

ఇలాంటి వ్యక్తి ఏపీ శాసనసభ స్పీకరా అని ప్రశ్నించిన సుంకర పద్మశ్రీ వెంటనే ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక అంతే కాదు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ దాదాపుగా బైబిల్ పట్టుకుని ఉంటారని, ఇక అలాంటప్పుడు తిరుమల ఆలయంలోకి వెళ్ళే విషయంలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత పద్మశ్రీ తేల్చిచెప్పారు. తిరుమల డిక్లరేషన్ ఇస్తే కొత్త ఇబ్బందులు వస్తాయని ఆలోచనతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. వైసిపి నేతలను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్న పద్మశ్రీ ఖచ్చితంగా తమ్మినేని సీతారాం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+