కొల్లు రవీంద్రకు ఊరట- అరెస్టైన గంట్లలోనే బెయిల్- పోలీసులకు అక్షింతలు
నిన్న ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ అరెస్టు చేసిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు నిన్నటి ఘటనలపై కొల్లు రవీంద్రను ఉదయం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
మచిలీపట్నంలో నిన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన కొల్లు రవీంద్రను కొందరు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్యుద్ధం నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర వాగ్యుద్ధానికి దిగారు. ఈ సందర్భంగా స్ధానిక ఎస్సైను ఆయన నెట్టారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. ఎన్నికల సమయంలో 144 సెక్షన్ ఉన్నా పట్టించుకోకుండా ఎక్కువ మందితో కలిసి బయట సంచరించడం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించినందుకు కేసులు పెట్టారు. వీటి ఆధారంగా ఇవాళ ఆయన్ను అరెస్టు చేశారు.

ఉదయం అరెస్టు చేసిన కొల్లు రవీంద్రను మచిలీపట్నం పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఆయనపై నమోదైన కేసుల నేపథ్యంలో రిమాండ్‌కు పంపాల్సి ఉండగా.. కేసు విచారించిన కోర్టు అదే సమయంలో కొల్లు రవీంద్ర పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో పోలీసులు కొల్లు రవీంద్ర అరెస్టులో నిబంధనలు పాటించలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని కొల్లు రవీంద్రకు ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications