విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కరోనా విలయం: లక్ష దాటింది - ఒకేరోజు 49 మంది బలి - కొత్తగా 6 వేల కేసులు - తూర్పులో టెర్రర్..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి విషయంలో దేశంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ పైపైకి పోతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6051 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్కును దాటి, 1,02,349కు చేరింది. ఇటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉండటం భయాందోళన కలిగిస్తున్నది. ఒక్కరోజే 49 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తంగా చనిపోయినవారి సంఖ్య 1090కి పెరిగింది.

Recommended Video

ఏపి లో సగం కేసులు అక్కడి నుంచే.. Covid19 Situation In Andhra Pradesh || Oneindia Telugu

పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?పాపులర్ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం - రాజకీయ పార్టీల వేధింపుల వల్లేనంటూ - భాషా దురభిమానం కారణమా?

రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 16.86 లక్షల కొవిడ్-19 టెస్టులు చేసినట్లు బులిటెన్ లో తెలిపారు. గడిచిన 24 గంటల్లో 43,127 శాంపిల్స్ ను పరీక్ష చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 1.02లక్షల కేసులకుగానూ 49,558 మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిపోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 51,701గా ఉంది. కొత్త కేసులు, మరణాల పరంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి మరింత భయానకంగా తయారైంది.

covid-19: with 6,051 new cases, AP’s tally crosses one lakh mark

సోమవారం వెల్లడించిన కొత్త కేసుల్లో అత్యధికంగా 1210 తూర్పగోదావరి జిల్లాలోనే నమోదుకావడం గమనార్హం. ఒక్కరోజులోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం కూడా ఇక్కడ 1095 కొత్త కేసులు, ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో కేసుల సంఖ్య 14,696కు, మరణాల సంఖ్య 129కి పెరిగింది. కొత్త కేసుల పరంగా గుంటూరు(744) తర్వాతి స్థానంలో ఉంది. కర్నూలు జల్లాలో 664, విశాఖ జిల్లాలో 655, అనంతపురం జిల్లాలో 524, నెల్లూరు జిల్లాలో 422, పశ్చిమగోదావరి జిల్లాలో 408, చిత్తూరు జిల్లాలో 367, కడప జిల్లాలో 336, ప్రకాశం జిల్లాలో 317, విజయనగరం జల్లాల్లో 157, శ్రీకాకుళం జిల్లాలో 120 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..కరోనా భయంతో కారు రాంగ్ టర్న్ - గర్భిణి సింధు రెడ్డి విషాదాంతం - తుంగభద్రలో మృతదేహం లభ్యం..

ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లాలో కొత్త కేసుల సంఖ్య 408కాగా, ఒక్కరోజులోనే అత్యధికంగా 9 మంది చనిపోయారు. పశ్చిమలో మొత్తం కేసులు 8820, మరణాలు 88గా నమోదయ్యాయి. తాజాగా విశాఖపట్నంలో 8 మంది చనిపోగా, చిత్తూరు 7, తూర్పుగోదావరి 7, కృష్ణా 5, విజయనగరం 4, అనంతపురం 3, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.

English summary
The number of coronavirus cases in Andhra Pradesh crossed the one lakh mark on Monday after 6,051 people were found infected in the last 24 hours, the state health department said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X