ఒసేయ్ ఎంకమ్మా- బుద్ధా వెంకన్నకు ఇచ్చి పడేసిన ఆర్జీవీ..!!

విజయవాడ: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి మధ్య జరిగిన సమావేశంపై చెలరేగిన దుమారం తగ్గట్లేదు. రోజురోజుకూ మరింత ముదురుతూనే వస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీ ఈ భేటీని సమర్థించుకుంటోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని చెబుతోన్నాయి.

తగ్గేదేలే..

తగ్గేదేలే..

చంద్రబాబు- పవన్ కల్యాణ్ సమావేశంపై అటు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా దండెత్తడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనదైన శైలిలో సెటైర్లు సంధిస్తోన్నారాయన. దీనిపై రెండురోజుల పాటు వరుసగా ట్వీట్లు చేశారు. ఇదివరకు ఆయన చంద్రబాబును సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిలదీశారు. కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది దుర్మరణంపాలు కావడం పట్లా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

బుద్ధా వెంకన్న రియాక్షన్..

బుద్ధా వెంకన్న రియాక్షన్..

చంద్రబాబును రామ్ గోపాల్ వర్మ నిలదీయడం, కాపులకు రిప్ పోస్టు పెట్టడం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు నచ్చలేదు. ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ వేదికగా రామ్ గోపాల్ వర్మపై విరుచుకుపడ్డారాయన. కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా.. అంటూ అషు రెడ్డి కాళ్లకు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ముద్దుపెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు.

రిప్ ఆర్జీవీ..

రిప్ ఆర్జీవీ..

అంతే కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదంటూ ఆర్జీవీని విమర్శించారు బుద్ధా వెంకన్న. రిప్ ఆర్జీవీ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారు. కంగ్రాట్స్ జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఈ నెల 9వ తేదీన బుద్ధా వెంకన్న పెట్టిన ఈ పోస్ట్‌కు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆయనకు రిప్లై ఇచ్చారు..తనదైన శైలిలో.

ఒసేయ్ ఎంకమ్మ..

ఒసేయ్ ఎంకమ్మ..

బుద్ధా వెంకన్నను ఒసేయ్ ఎంకమ్మ అంటూ సంబోధించారు. తాను ఒక అందమైన అమ్మాయి కాలిని పబ్లిక్‌గా నాకానని గుర్తు చేశారు. నువ్వు మాత్రం ప్రైవేట్‌గా నీ బాస్‌ను సుఖపెట్టడానికి ఎక్కడ నాకుతావో పబ్లిక్ అందరికి తెలుసు కదా బేబీ.. అంటూ సెటైరికల్‌గా రెచ్చిపోయారాయన. ఈ ట్వీట్ల యుద్ధంలో బుద్ధా వెంకన్న-ఆర్జీవీ హద్దు దాటినట్టే కనిపించింది. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ- అటు కాపులు, కమ్మ సామాజిక వర్గాలపై ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

అర్థంకాని మేథమేటిక్స్..

అర్థంకాని మేథమేటిక్స్..

అక్కడితో ఆగలేదు రామ్ గోపాల్ వర్మ. తన దాడిని కంటిన్యూ చేశాడు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో స్పందించారు. కాపులు, కమ్మ వాళ్లు, జనసేనలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. ఆయా సమీకరణాలన్నింటినీ ఆయన మేథమేటిక్స్ తో పోల్చారు. కాపులు - కాపులు x కాపులు + కమ్మోళ్ళు ÷ సేనలు - సేనలు ఇస్ నాట్ = ఓట్లు. కాపులు, కమ్మవాళ్ల సమీకరణాలు అర్థం కావట్లేదని, ఇందులో జనసేన ప్రమేయం వల్ల ఓట్లు రావనీ తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+