Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తను విడిచిపెట్టి 15ఏళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం: అనుమానంతో ప్రియుడే దారుణంగా..

విజయవాడ: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు లాంటి ఘోరాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైనప్పటికీ పలు కారణాలతో ఇతరులతో సంబంధం పెట్టుకోవడంతో ఈ దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

కట్టుకున్న భర్తతో విడిపోయి..

కట్టుకున్న భర్తతో విడిపోయి..

కట్టుకున్న భర్తతో విభేదాల కారణంగా అతడ్ని విడిచిపెట్టిన ఓ వివాహిత.. మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. 15ఏళ్లుగా సజావుగానే సాగిన వారి సహజీవనంలో గత కొద్దిరోజులుగా అనుమానాలు చోటు చేసుకున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రియుడు.. సహ జీవనం చేస్తున్న భాగస్వామిని దారుణంగా హత్య చేశాడు. కృష్ణా జిల్లాలోని మైలవరంలో చోటు చేసుకుంది.

17ఏళ్ల క్రిందట వివాహం..

17ఏళ్ల క్రిందట వివాహం..

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేటకు చెందిన విజయలక్ష్మికి 17ఏళ్ల కిందట గంపలగూడెం మండలం దుందిరాలపాడుకు చెందిన మొగిలి మారేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అనంతరం విభేదాల కారణంగా పెద్దల సమక్షంలో ఈ దంపతులు విడిపోయారు.

15ఏళ్ల సహజీవనంలో అనుమానం..

15ఏళ్ల సహజీవనంలో అనుమానం..

ఆ తర్వాత విజయలక్ష్మి మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన గాలంకి రాజేష్ అనే వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తోంది. గత 15ఏళ్లుగా ఆమె అతనితోనే ఉంటోంది. అయితే, మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉంటోందని రాజేష్‌కు అనుమానం కలిగింది. దీనిపై కొద్ది రోజులుగా ఆమెతో గొడవపడుతున్నాడు.

గడపారతో కొట్టడంతో కుప్పకూలిన మహిళ..

గడపారతో కొట్టడంతో కుప్పకూలిన మహిళ..

గత శుక్రవారం కూడా విజయలక్ష్మితో రాజేష్ వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహానికి గురైన అతడు ఇంట్లోని గడ్డపార తీసుకుని ఆమె తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు రాజేష్ అక్కడ్నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆదివారం నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+