లక్షకు 15 లక్షలు.. మొహం చాటేసిన ఏజెన్సీ.. ఎక్కడ అంటే

అమాయకులే ఉండాలే కానీ.. మోసగాళ్లకు కొదవలేదు. వారికి నమ్మకమే పెట్టుబడి.. కొద్దీరోజులు బానే ఉంటారు. తర్వాతే రాత్రికి రాత్రి బిచాణా ఎత్తివేస్తారు. రోజుకో చోట ఇలాంటి ఘటన జరుగుతున్న జనంలో అవేర్ నెస్ రావడం లేదు. సో మోసపోవడం ఖాయమే అవుతుంది. ఇలాంటి ఘటన విజయవాడలో జరిగింది. అధిక డబ్బులకు ఆశపడి ఉన్నది కోల్పోయారు.

 fraud in the name of share market in vijayawada

విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం జరిగింది. మూడు లక్షలు పెట్టుబడి పెడితే చాలు నెలకు 45000 వస్తుందంటూ మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. లాభ నష్టాలతో సంబంధం లేకుండా తక్కువ సమయంలోనే లక్షకు 15 లక్షల రూపాయల వడ్డీ వస్తుందంటూ మోసం చేశారు. డబ్బులు కట్టిన తర్వాత సంస్థ ప్రతినిధులు ముఖం చాటేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే పని మొదలుపెట్టారు. పెనమలూరు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.

ANVS సర్వీసెస్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసిందని బాధితులు తెలిపారు. హాసన్న, హర్ష కుమార్, జ్ఞానేశ్వర్ లు పార్టనర్లుగా ఉండేవారని పోలీసులతో చెప్పారు. ఇప్పటివరకు సుమారుగా రూ.15 కోట్లు మోసం చేసినట్టు పోలీసులు లెక్కకట్టారు. ఆ డబ్బును క్లియర్ చేస్తామని వారు అంటున్నారు. కానీ మోసగాళ్లు మాత్రం రెచ్చిపోతునే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+