గన్నవరం పాలిటిక్స్ : వల్లభనేని వంశీకి యార్లగడ్డ షాక్ పక్కానేనా!!

గన్నవరం రాజకీయాలు తాజాగా మరోమారు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి టికెట్ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న నేతలు ఎవరికి వారు తమదైన శైలిలో మాటల తూటాలను పేలుస్తున్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉంటూ వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు తాజాగా తాను గన్నవరం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చేసిన ప్రకటన వైసీపీలో కుమ్ములాటలను బహిర్గతం చేస్తుంది.

2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత వైసిపికి మద్దతునిచ్చిన వల్లభనేని వంశీ, గన్నవరంలో వైసిపి లోకి రావడంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో గందరగోళం చోటుచేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకు వంశీ, యార్లగడ్డ వెంకట్రావు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే క్రమంలో తాజాగా ఇరువురు నేతలు వచ్చే ఎన్నికలలో గన్నవరం నుండి బరిలోకి దిగేది తామేనని ఎవరికివారు సంచలన ప్రకటనలు చేస్తున్నారు.

Gannavaram Politics: Yarlagadda shocked Vallabhaneni Vamsi.. ticket war in YSRCP!!

ఒకపక్క గన్నవరం నియోజకవర్గం నుండి వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమయంలో తాను గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్రావు చెప్పడం, తాను గన్నవరం రాజకీయాలలోనే కొనసాగుతానని స్పష్టం చేయడం, తాజాగా వైసిపి సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో భేటీ అవ్వడం వెరసి గన్నవరం పాలిటిక్స్ గరం గరం గా మారాయి.

తాను అమెరికా వెళుతున్నాను అని దుష్ప్రచారం చేశారని యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా గన్నవరం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆయన, తను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది మాత్రం ప్రకటించలేదు. దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

గన్నవరం నియోజకవర్గం నుండి వల్లభనేని వంశీకి వైసిపి టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే, కచ్చితంగా యార్లగడ్డ వెంకట్రావు పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన టిడిపిలో లేదా జనసేన పార్టీలో అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. మరి గన్నవరం పాలిటిక్స్ ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతాయో.. వల్లభనేని వంశీ వర్సెస్ గన్నవరం వైసిపి విషయంలో సీఎం జగన్ ఏం చేస్తారో భవిష్యత్ లో తెలియనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+