విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను షర్మిల లాంటివాడినే: మీరిచ్చే 2వేల కోట్ల కోసం ఓట్లు వేయ‌లేదు: సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ లేఖ‌..

|
Google Oneindia TeluguNews

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ల‌లొ కాపుల‌కు అయిదు శాతం వ‌ర్తించ‌ద‌ని ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. దీంతో..టీడీపీ కాపు నేత‌ల‌తో పాటుగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సైతం స్పందించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ల పై ఏ కోర్టు స్టే ఇచ్చిం దో వివ‌రించాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న లేఖ‌లో ముఖ్య‌మంత్రిని కోరారు. ప్ర‌భుత్వం ఇస్తున్న రెండు వేల కోట్ల కోసం జ‌గ‌న్‌కు ఓటు వేయ‌లేద‌ని పేర్కొన్నారు. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల లాంటివాడినే అని గ్రహించమ ని కోరుతున్నాను అంటూ లేఖ‌లో అభ్య‌ర్దించారు. ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు సైతం ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యం పైన అసంతృప్తి వ్య‌క్తం చేసింది. త్వ‌రలోనే భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ముఖ్య‌మంత్రికి ముద్ర‌గ‌డ లేఖ‌..

ముఖ్య‌మంత్రికి ముద్ర‌గ‌డ లేఖ‌..

కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాసారు. తాగాజా ఏపీ ప్ర‌భుత్వం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ల‌లొ కాపుల‌కు అయిదు శాతం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. పేద‌ల‌కు ఈ చ‌ట్టం వ‌ర్తింస్తుంద‌ని పేర్కొంది. దీని పైన టీడీపీ కాపు నేత‌లు సైతం అసంతృప్తి వ్య‌క్తం చేసారు. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం త‌న లేఖ‌లో ఈబీసీ కోటాలో ఐదు శాతం రిజర్వేషన్లపై... ఏ కోర్టు స్టే ఇచ్చిందో సీఎం జగన్‌ చెబితే సంతోషిస్తానన్నారు. నిజంగా కోర్టు స్టే ఉంటే తిరిగి ఎన్నికలు వచ్చేవరకు... తమ డిమాండ్లు, హక్కులు అడగకుండా నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటానని ముద్రగడ లేఖలో స్ప‌ష్టం చేసారు. కాపు జాతి ఎటువంటి కోరిక‌లు లేకుండా బానిస‌లుగా బ‌త‌కాలా అని ప్ర‌శ్నించారు. ఏ కోర్టు తీర్పు ఇచ్చిందో మీరు శాస‌న‌స‌భ‌లో లేదా మీడియా ద్వారా వివ‌రించాలంటూ సీఎంకు సూచించారు. అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో తీర్పు గురించి ప్ర‌స్తావించారు.

 మీరిచ్చే రెండు వేల కోట్ల కోసం కాదు..

మీరిచ్చే రెండు వేల కోట్ల కోసం కాదు..

కేవ‌లం మీరు కాపుల‌కు ప్ర‌తీ ఏటా ఇస్తాన‌ని చెప్పిన రెండు వేల కోట్ల కోసం ఆశ‌ప‌డి కాపులు ఓట్లు వేసారని భావిస్తున్నా రా అంటూ ప్ర‌శ్నించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చి తీరుతానన్నారు. కానీ లోక్‌సభలో ఆర్థిక, హోం మంత్రిగారు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం లాంటిదని చెప్పడం జరిగింది. మడమతిప్పని మీరు కనీసం హోదా గురించి పట్టించుకోకుండా బానిసలు బతుకుతున్న మా జాతి ఆశలపై నీళ్లు చల్లడం మీకు తగునా ముఖ్యమం త్రి గారూ అంటూ త‌న లేఖ‌లో ప్ర‌శ్నించారు.అంతుకు ముందు టీడీపీ నేత‌లు సైతం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కాపుల‌కు న‌ష్టం చేసేదిలా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. కాపుల‌కు ద్రోహం చేసేలా ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ఉంద‌ని..త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని వారు స్ప‌ష్టం చేసారు. చంద్ర‌బాబు విదేశాల నుండి వ‌చ్చిన త‌రువాత దీని మీద నిర్ణ‌యం తీసుకొనే అవ‌కాశం ఉంది.

ష‌ర్మిళ లాంటి వాడినే అంటూ ముద్ర‌గ‌డ‌..

ష‌ర్మిళ లాంటి వాడినే అంటూ ముద్ర‌గ‌డ‌..

త‌న లేఖ‌లో ముద్ర‌గ‌డ ష‌ర్మిళ అంశాన్ని ప్ర‌స్తావించారు. అయ్యా.. ఆ మధ్య తమరి సోదరి షర్మిల మీద బూతులు సోషల్ మీడియాలో ప్రచారం అయిన సందర్భంగా వారు బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అలాగే ఈ రోజు నన్ను కాపు ద్రోహి, స్వార్థపరుడు, గజదొంగ, అమ్ముడుపోయాడు, మునిగిపోయి న ముద్రగడ అని ఎన్నో బూతులు అన్ని పార్టీల వారు రాయిస్తున్నారు. వాటికి బెదిరిపోవడానికి నేనేమీ ఎన్ఆర్ఐను కాదండి. దయచేసి నేను కూడా మీ సోదరి షర్మిల లాంటివాడినే అని గ్రహించమని కోరుతున్నాను..అంటూ సీఎంకు రాసిన లేఖ‌లో అభ్య‌ర్దించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కాపు నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా కాపు నేత‌ల నుండి వ‌స్తున్న డిమాండ్ల నేప‌థ్యంలో ఏ ర‌కంగా ముందుకెళ్లాలో నిర్ణ‌యించేందుకు క‌మిటీని ఏర్పాటు చేసారు. కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో క‌మిటీ సూచ‌న‌లు చేయ‌నుంది.

English summary
Kapu moment leader Mudragada Padmanabham letter to Jagan to give clarity on objection on EWS reservation implementa tion for Kapu community. CM Jagan met with Kapu leaders discussed about recent developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X