నిమ్మగడ్డను కెలికిన కేశినేని నానీ ... జగన్ కు ఆ విషయంలో సవాల్

Recommended Video

    ఏపీ సీఎం జగన్ పై మాటల దాడిని పెంచిన కేశినేని నానీ || Vijayawada MP Kesineni Nani Challenge To Jagan

    ఏపీ సీఎం జగన్ పైన కూడా కేశినేని నానీ మాటల దాడిని పెంచారు. మొన్నటికి మొన్న పిచ్చోడి చేతిలో రాయి మీ చేతిలో పాలన అంతే అని జగన్ ను ఉద్దేశించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన నానీ మరోమారు జగన్ పై తన వాగ్బాణాలను సంధించారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానీ సొంత పార్టీ నేతలను, ప్రత్యర్థి పార్టీ నేతలను అన్న తేడా లేకుండా సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ను కూడా టార్గెట్ చేసి నానీ ఇప్పుడు తాజాగా తన లిస్టు లో నిమ్మగడ్డ ప్రసాద్ ను కూడా చేర్చారు .

    బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ గురించి చేసిన కేశినేని ట్వీట్ లో నిమ్మగడ్డను కెలికిన నానీ

    బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ గురించి చేసిన కేశినేని ట్వీట్ లో నిమ్మగడ్డను కెలికిన నానీ

    కేశినేని నాని తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నానీ సవాల్ విసిరారు. బెంజ్‌సర్కిల్ ఫ్లైఓవర్ జాప్యంపై కేశినేని నాని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడటమే కాకుండా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తావన తెచ్చారు . జగన్‌కు చేతకాకపోతే చెప్పాలని.. తాను చేసి చూపిస్తానని , ఇక జగన్ నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రూ.1,250 కోట్ల నిధుల విడుదల చేయించటంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ట్విట్టర్‌ వేదికగా ఫైర్ అయిన కేశినేని నాని చేసిన ట్వీట్ లో ‘‘ఇంత చిన్న సమస్యకు పరిష్కారం చూపలేని మీరు ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక పెద్ద పెద్ద సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారు జగన్ రెడ్డి గారు? మీకు చేతకాకపోతే చెప్పండి నేను చేసి చూపిస్తా. మీరు నిమ్మగడ్డ వ్యవహారం చూసుకోవచ్చు'' అని ఘాటుగా ఎద్దేవా చేశారు . దీంతో నానీ ఖాతాలో ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ పేరు చేరింది.

     సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేయటంతో కేంద్ర సహాయాన్ని కోరిన జగన్

    సెర్బియా పోలీసులు నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేయటంతో కేంద్ర సహాయాన్ని కోరిన జగన్

    వాన్ పిక్ కేసులో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే . ఇక ఆయనను భారత్ కు రప్పించటానికి జగన్ కేంద్ర సహకారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారు. దీంతో ఏపీ సీఎం జగన్ , వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు ఉన్న సంబంధాలపై వెటకారంగా కేశినేని నానీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

    జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు సోషల్ మీడియా లో కేశినేని దూకుడు

    జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు సోషల్ మీడియా లో కేశినేని దూకుడు

    మొన్నటికి మొన్న స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై విరుచుకుపడ్డ నానీ జగన్ రెడ్డి గారు, పిచ్చివాడి చేతిలో రాయిలా ఉంది మీ చేతిలో అధికారం' అంటూ ఎద్దేవా చేశారు . మీరు చేసిన చట్టమే ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై, పూణె, ఢిల్లీలాంటి చోట్ల మన వారికి ఉద్యోగాలు వస్తాయా? అమ్మ పెట్టదు... అడుక్కు తిననివ్వదు అన్నట్టుంది పరిస్థితి అని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కేశినేని నాని ట్వీట్ చేశారు. ఇక అంతే కాదు విజయవాడలో రహదారుల పరిస్థితిపై పోస్ట్ చేసి సీఎంగారు ముందు ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+