కొడాలి నానీ లాజిక్ ... నారా లోకేష్ మైండ్ బ్లాంక్ !!
కొడాలి నాని టీడీపీ నుండి అందులోనూ చంద్రబాబు స్కూల్ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు . ఇక టీడీపీ నుండి కొన్ని కారణాల వలన బయటకు వచ్చి వైసీపీలో చేరిన నానీ ఆ పార్టీలో ప్రస్తుతం కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవిని పొందిన ఆయన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీపై ప్రస్తుతం నిప్పులు చెరుగుతున్నారు. మంత్రిగా ఉంటూ తెలుగుదేశం పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు.

నారా లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్
శాసనసభలో చంద్రబాబును, శాసనమండలిలో లోకేష్ ను టార్గెట్ చేసుకుని నోటికి వచ్చినట్టు తిట్టిపోస్తున్నారు . తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబుపైనా నిప్పులు చెరుగుతున్న ఆయన ఇప్పుడు తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయం చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటి?..వైఎస్ శాసన మండలి ఏర్పాటు చేయకపోయి ఉండుంటే లోకేష్ మంత్రి అయ్యేవారు కాదని ఒక లెక్కలో నారా లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ ఆర్ అని చెప్పి షాక్ ఇచ్చారు .

శాసనమండలి లేకుంటే లోకేష్ మంత్రి అయ్యేవారు కాదన్న నానీ
సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు ఉండబట్టే చంద్రబాబు లాంటి చెత్త వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులు అయ్యారని కొడాలి నాని పేర్కొన్నారు. లోకేష్ కు రాజకీయ భిక్ష పెట్టింది బాబు కాదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పిన నాని ఇచ్చిన లాజిక్ దెబ్బకు అందరూ షాక్ అయ్యారు . 1985లో ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేస్తే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరిగి మండలిని తీసుకొచ్చారని పేర్కొన్న నానీ మండలిలో పెద్దమనుషులు ఉంటె, దాని వలన పరిపాలనలో ఎలాంటి లోపాలు లేకుండా ఉంటాయని నాడు వైఎస్సార్ భావించారని పేర్కొన్నారు .

రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురాకుంటే లోకేష్ రాజకీయ భవిష్యత్ శూన్యం అన్న నానీ
ఆరోజు రాజశేఖర్ రెడ్డి మండలిని తీసుకురాకుండా ఉంటే, లోకేష్ మంత్రి అయ్యేవాడు కాదన్న నానీ , శాసనమండలిలో కూర్చునే అవకాశం అప్పుడు లోకేష్ కు ఉండేది కాదన్నారు. మేధావుల కోసం మండలిని ఏర్పాటు చేస్తే, చంద్రబాబు చెత్తను తీసుకొచ్చి మండలిలో వేస్తున్నారని కొడాలి నానీ విమర్శించారు . కొడాలి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నానీ చెప్పిన లాజిక్ దెబ్బకు లోకేష్ కు దిమ్మ తిరిగింది మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది అని సెటైర్లు వేస్తున్నారు వైసీపీ సభ్యులు .
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
చంద్రబాబుకు జాతీయ పార్టీ నేత సవాల్: మణిపూర్ లా తయారవుతాయి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications