విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మ చంద్రబాబు .. ఆయన స్టేల బాబు : కొడాలి నాని ఫైర్

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . విచారణ ఎదుర్కోలేని పిరికిపంద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అని కొడాలి నాని అభివర్ణించారు. ప్రతి దానిపై చంద్రబాబు స్టే లు తెచ్చుకుంటారని విమర్శించారు .

విచారణ ఎదుర్కోలేని పిరికిపందగా చంద్రబాబు భారతదేశంలో ప్రసిద్ధి

విచారణ ఎదుర్కోలేని పిరికిపందగా చంద్రబాబు భారతదేశంలో ప్రసిద్ధి

శనివారం మీడియాతో మాట్లాడిన కొడాలి నాని విచారణ ఎదుర్కోలేని చవట ,దద్దమ్మగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నారా చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. చంద్రబాబును చంద్రబాబు అని పిలిచే కంటే స్టేల బాబు అని పిలిస్తే బాగుంటుందని కొడాలి నాని ఎద్దేవా చేశారు. సిఐడి విచారణలో దొరికిపోతాననే భయంతో స్టేల బాబు మళ్లీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని కొడాలి నాని విమర్శించారు .

చంద్రబాబు స్టే లు తెచ్చుకున్నా ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

చంద్రబాబు స్టే లు తెచ్చుకున్నా ప్రజా కోర్టులో శిక్ష తప్పదు

చంద్రబాబుకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మళ్లీ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఆయన కోర్టుల నుంచి 30 వ స్టే తెచ్చుకున్నారని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద సుప్రీంకోర్టు లాయర్లను తెచ్చుకుంటున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

 చంద్రబాబు కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకున్నా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

చంద్రబాబు కోర్టు ద్వారా స్టేలు తెచ్చుకున్నా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఎన్ని ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పే తీరతారు

ఇటీవల మున్సిపల్ ఎలక్షన్ లో ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని పేర్కొన్న కొడాలి నాని త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ మండల పరిషత్ ఎన్నికలలో, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కు శిక్ష వేస్తారన్నారు . అప్పుడు చంద్రబాబు రోడ్డుమీదకు కూడా రాకుండా ఇంటికే పరిమితం అవుతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా చంద్రబాబు తాను చేసిన నేరాల నుంచి తప్పించుకోవచ్చు కానీ ప్రజా కోర్టులో వేసే శిక్ష నుండి తప్పించుకోలేరని కొడాలి నాని అన్నారు.

అతి భయంకరమైన శిక్ష వెయ్యటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

అతి భయంకరమైన శిక్ష వెయ్యటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

అతి భయంకరమైన శిక్ష చంద్రబాబుకు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు. ఇప్పటికే చంద్రబాబుకు అనేకసార్లు బుద్ధి చెప్పారని తెలిపారు కొడాలి నాని. రాజధాని భూముల అక్రమాల వ్యవహారంలో సిఐడి విచారణకు నోటీసు ఇవ్వడంతో, ఆ నోటీసుపై కోర్టుకు వెళ్లిన చంద్రబాబు స్టే తెచ్చుకోవడంతో పై వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+