పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టటం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదని నాగబాబు సంచలనం ..
Recommended Video
మెగాబ్రదర్ నాగబాబు , పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని చెబుతూనే జనసేన ఆవిర్భావం నాటి పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన రాజకీయ పార్టీని స్థాపించడం తమ కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని మెగాబ్రదర్, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు స్పష్టం చేశారు.

చిరంజీవి రాజకీయాల్లో కష్టాలు పడ్డాడు కనుకే పవన్ కు కష్టాలు వద్దని వారించిన మెగా ఫ్యామిలీ
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి మెగా ఫ్యామిలీ నిరాకరించడానికి కారణాలు లేకపోలేదని అప్పటికే తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో చేదు అనుభవాలు చవిచూడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక అందువల్ల తమ కుటుంబీకులు ఎవరూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడాన్ని అంగీకరించలేదని తెలిపారు.
పార్టీ పెట్టి తన తమ్ముడు ఎందుకు కష్టపడాలి అని తామంతా ఆలోచించామని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. తన సోదరుడు చిరంజీవి ఎంత ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసనని అందువల్లే తాను ఆ ఇబ్బందులు తన తమ్ముడు పవన్ కు అవసరం లేదని ఆలోచించామని పేర్కొన్నారు. అందువల్లే ఫ్యామిలీ అంతా పవన్ పార్టీపెట్టడంపై విముఖత చూపినట్లు తెలిపారు.

పవన్ పట్టుదలే జనసేన పార్టీ పెట్టటానికి కారణం .. పవన్ ఆదర్శాలు అర్ధం అయ్యాకే తాను వచ్చానన్న నాగబాబు
కానీ పట్టుదల ఉన్న కళ్యాణ్ బాబు జనసేన పార్టీ పెట్టారని చెప్పిన నాగబాబు అనుకున్నది సాధించే వ్యక్తిత్వం అని పవన్ గురించి చెప్పారు. ఇక ఆవిర్భావ సభ రోజు తాను గోవాలో సినిమా షూటింగ్ లో ఉన్నానని తెలిపారు. షూటింగ్ మధ్యలో ఆపేసి పవన్ కళ్యాణ్ స్పీచ్ రెండు గంటల సేపు విన్నట్లు చెప్పుకొచ్చారు నాగబాబు. ఇక ఆ ప్రసంగం విన్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆదర్శాలు అర్థ మయ్యాయని అని చెప్పిన నాగబాబు వాటి ఆచరణలో పవన్ కళ్యాణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో అని సందేహం కలిగింది అన్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించిన తర్వాత, పార్టీ సిద్ధాంతాలను తాను అర్థం చేసుకోవడానికి రెండున్నరేళ్లు పట్టిందని చెప్పుకొచ్చారు.తానూ అందరి కంటే పార్టీలో జూనియర్ ని అని పేర్కొన్నారు.

రాజకీయాల ప్రక్షాళన కోసమే జనసేన .. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా పని చేస్తానన్న మెగా బ్రదర్
ఏదేమైనా నిస్వార్ధమైన మనస్తత్వంతో తన సోదరుడు రాజకీయాల్లోకి వచ్చాడని పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరమని నాగబాబు తన అభిప్రాయం చెప్పారు.
పవన్ కళ్యాణ్ పట్టుదల, అకుంఠిత దీక్ష అనితరసాధ్యమైన దని జనసేన పార్టీ ఇంత వరకు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ కృషి అని పేర్కొన్నారు. ఇక రాజకీయాలంటే దేశానికి ఆదాయవనరుగా మారిపోయాయి అన్న బాబు రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పుకొచ్చారు. 80 శాతం మంది రాజకీయ నాయకులు రాజకీయాలను ఆర్థిక వనరులు కూడా చూస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఒక శక్తి అని, ఏదీ ఆశించకుండా పని చేస్తారని ఆయన ప్రశంసించారు. భవిష్యత్ లో జనసేన పార్టీ బలోపేతానికి తాను అహర్నిశలు శ్రమిస్తానని హామీ ఇచ్చారు.జనసేన పార్టీలో తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించి అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో చేస్తానని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications