కాకాణి ఫోర్జరీ కేసులో ట్విస్ట్.. కేసు నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు బదిలీ

నెల్లూరు కోర్టు చోరీ పత్రాలు మాయం ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణను నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ స్పెషల్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో కేసు నుంచి కాకాణి ఊరట కలిగింది అనుకున్న ఇప్పుడు వచ్చిన ట్విస్ట్‌తో అదేం లేదని తేలిపోయింది. విచారణ జరగనుండటంతో ఆయన పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వారం క్రితమే

వారం క్రితమే

నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో డాక్యుమెంట్ల చోరీ జరిగిన వారం రోజుల క్రితం ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం నెల్లూరు కోర్టుకు ఉత్తర్వులు పంపించింది. విచారణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను తమకు బదిలీ చేయాలని, ఆ కేసులకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను తమకు పంపాలని ఆదేశించింది. మంత్రి కాకాణిపై నమోదైన 11 కేసులను బదిలీ చేసి, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించేందుకు సిద్దమయ్యింది.

కుక్కలు మొరగడంతో..

కుక్కలు మొరగడంతో..

ఈ నెల 13వ తేదీన ఆ డాక్యుమెంట్లు చోరీకి గురి అయిన సంగతి తెలిసిందే. కుక్కలు మొరగడంతో దొంగలు కోర్టు హాలులోకి పరిగెత్తారని, అక్కడ పాత వస్తువులు దొంగిలించేందుకు ప్రయత్నించారని పోలీసులు చెబుతున్నారు. ఆ డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని చెప్పడంపై ప్రతిపక్ష నేతలు సందేహాలు వ్యక్తం చేశారు.

చోరీ జరిగిన స్థలంలో చెల్లాచెదురుగా పడిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానానికి అప్పగించినట్టు నెల్లూరు పోలీసులు చెబుతున్నప్పటికీ, అవి తమకు అందలేదని విజయవాడ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది. కానీ విచారణ మాత్రం జరగనుండటంతో.. హై టెన్షన్ నెలకొంది.

కాకాణి వెర్షన్ ఇలా

కాకాణి వెర్షన్ ఇలా

అంతకుముందు ఇదే అంశంపై కాకాణి గోవర్దన్ మాట్లాడారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ విచారణ కూడా జరిపించుకోవచ్చని చెప్పారు. నెల్లూరు జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎవరితో భేదాభిప్రాయాలు లేవని, అందరం కలిసి పని చేస్తామని చెప్పారు. కోర్టు ఫైల్స్‌ చోరీ వెనుక కుట్ర ఉందన్నారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. తనను బద్నాం చేయడానికే... కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఆరోపణ చేసేవారు సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయాలని కోరారు. తాను సీబీఐ విచారణను స్వాగతిస్తానన్నారు.

ఇదీ నేపథ్యం

ఇదీ నేపథ్యం

మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్‌లో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు.

ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆ పత్రాలు కనిపించకుండా పోయాయి. దొంగతనం జరిగినా.. పత్రాలు మాత్రం రికవరీ జరగలేదు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే.. కాకాణి స్పందించారు. ఏ విచారణకైనా సిద్దమని ప్రకటంచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+