విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయేషా మీరా హత్యకేసుపై స్పందించిన ఎమ్మెల్యే రోజా...

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు సీబీఐ విచారణతో మరోసారి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. హైకోర్టు ఆదేశాలతో ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు రీపోస్ట్‌మార్టం చేశారు. ఈ సంధర్భంలోనే ఆయేషా మీరా తల్లి శంషద్ బేగం స్పందించారు. ముఖ్యంగా ఆమె ఎమ్మెల్యే రోజా ఎందుకు స్పందించడం లేదంటూ... ప్రశ్నించారు.

హత్య జరిగిన సంధర్భంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన రోజా...ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు. నిందితులు ఎవరో రోజాకు తెలుసు అన్నారు. 21 రోజుల్లో నిందితుల్ని పట్టుకుంటామన్న సీఎం జగన్... ఆయేషా కేసును కూడా పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఇదే అంశంపై రోజా ఒక్కసారి సీఎం జగన్‌తో చర్చిస్తే... సమస్య పరిష్కారం అవుతుందని , ఆమె సీఎం జగన్‌ న్యాయం చేస్తారని పేర్కోంది. తన వ్యాఖ్యలపై రోజా స్పందించారు.

MLA Roja has responded of Ayeshameera murder case

దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. తాను ఆయేషా మీరా సంఘటన తర్వాత ఒక పార్టీ మహిళ అధ్యక్షురాలిగా స్పందించానని ,దీంతో భాదితురాలి కుటుంబానికి అండగా ఉన్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు రాష్ట్రమంతా తిరిగానని చెప్పారు. అయితే తాను ప్రస్తుతం స్పందించడం లేదన్న ఆయేషా మీరా తల్లి వ్యాఖ్యలు తనను బాధించాయని అన్నారు.

ఆయేషామీరా హత్యకు గురైన పన్నేండెళ్ల తర్వాత రీపోస్ట్‌మార్టమ్ నిర్వహించిన విషయం తెలిసిందే.. 2007లో ఆమె విజయవాడ సమీపంలోని ఇబ్రంహీంపట్నంలో హత్యకు గురైన తర్వాత అనేక సంచలనాలకు తెరతీసింది. హత్య కేసులో ఎంతో మందిని విచారించి చివరకు వదిలివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడుగా పేర్కోన్న సత్యం బాబుకు మహిళ కోర్టు శిక్ష వేస్తే... సత్యంబాబు నిర్థోషి అంటూ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే దోషులెవరో తేలకపోవడంతో హైకోర్టు నేరుగా సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

English summary
MLA Roja has responded to the comments made by Ayeshamaera mother Shamshad Begum,on why MLA Roza is not responding now on the murder of Ayeshameera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X