విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హమ్మయ్యా.. ఏపీలో మంకీ పాక్స్ నో.. అవీ మాములే దద్దుర్లేనట..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మంకీ పాక్స్ అనే రుమార్లు కలకలం రేపాయి. దుబాయ్ నుంచి వచ్చిన చిన్నారికి దద్దుర్లు రావడంతో మంకీ పాక్స్ అని ప్రచారం జరిగింది. అయితే ఫ్యామిలీని ఐసోలేషన్‌లో ఉంచి.. చిన్నారి నమూనాలను పుణె పంపించిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ పోలిన లక్షణాలు కనిపించాయి. మంకీపాక్స్ అయి ఉంటుందనే అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు.

అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్‌గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ లేదని వైద్యులు నిర్ధారించారు. బాలిక చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చాయని వైద్యులు గుర్తించారు. బాలిక కుటుంబం ఇతరులతో కాంటాక్ట్ కాలేదని ఆరోగ్యశాఖ కమిషనర్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

no Monkeypox case register in andhra pradesh

ఎలుకలు, ప్రైమేట్స్ వంటి అడవి జంతువుల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం ఉంది. ఇది అరుదైన వ్యాధి, మశూచికి దారితీసే వైరస్ వంటి ఇతర పాక్స్ వైరస్ల మాదిరిగానే ఉంటుంది. మంకీపాక్స్ ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా సోకే అవకాశం ఉంది. గాయం, శారీరక సంపర్కం వల్ల కూడా వ్యాపిస్తుందట. మనషులకు అయితే.. ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం వల్ల వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకరు మంకీపాక్స్‌కు గురైన సమయంలో వెంటనే లక్షణాలను చూపించదు. వైరస్ కోసం పొదిగే కాలం ఏడు నుండి 21 రోజుల మధ్య ఉంటుందట. అలాగే మంకీ పాక్స్ వచ్చిన వారికి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, చలి, అలసట ఉంటుంది.

English summary
no Monkeypox case in the andhra pradesh. that child rashes are casual pune virology experts said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X