• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

గన్నవరం వైసీపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్‌- వంశీకి కరోనా- ఏకమైన ముగ్గురు ప్రత్యర్ధులు..

|

కృష్ణాజిల్లా గన్నవరంలో వైసీపీ గ్రూపు రాజకీయాలు పతాకస్ధాయికి చేరుకున్నాయి. ఇప్పటికే సీఎం జగన్‌ సహా వైసీపీ కీలక నేతలు చెబుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా గ్రూపులు కడుతూ ఆధిపత్య పోరు సాగిస్తున్న స్ధానిక నేతలు మరోసారి అదనుచూసి ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలేవీ సఫలం కాకపోవడంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే వంశీ మోహన్‌కు కరోనా సోకడంతో ఆయన్ను అదను చూసి దెబ్బతీసేందుకు ప్రత్యర్ధి గ్రూపులు ఏకమవుతుండటం కలకలం రేపుతోంది.

గన్నవరంలో ఆగని వర్గపోరు..

గన్నవరంలో ఆగని వర్గపోరు..

గతేడాది ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీలో చేరిపోయారు. జిల్లాలోని కీలకమైన గుడివాడ, మచిలీపట్నంతో పాటు మరికొన్నిచోట్ల వంశీకి పాత స్నేహితులైన మంత్రులు కొడాలి నాని, పేర్నినాని ఒత్తిడి మేరకు ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే అనర్హత భయంతో పార్టీలో చేరకుండా దూరం పాటిస్తున్నారు. అయినా గన్నవరంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంశీయే అభ్యర్ధి అంటూ సీఎం జగన్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావుతో పాటు సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రగిలిపోతున్న వీరంతా ఇప్పుడు ఏకమవుతున్నట్లు తెలుస్తోంది.

వంశీని అదను చూసి దెబ్బకొట్టే వ్యూహం...

వంశీని అదను చూసి దెబ్బకొట్టే వ్యూహం...

కొన్నిరోజుల క్రితం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత కూడా ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో నియోజకవర్గంలో వంశీకి ప్రత్యర్ధులుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్గగడ్డ వర్గాలతో పాటు దాసరి బాలవర్దనరావు వర్గం కూడా ఏకమైంది. ఈ మూడు వర్గాలు కలిసి వంశీని నియోజకవర్గం బాధ్యతల నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి వచ్చిన వంశీకి బదులుగా పార్టీని నమ్ముకున్న తమలో ఒకరికి గన్నవరం బాధ్యతలు అప్పగించాలని అధిష్టానాన్ని కోరేందుకు వీరు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

  బ్లాక్ Online Gaming Sites in AP, CM Jagan Writes To Centre || Oneindia Telugu
   జగన్‌ మడమ తిప్పుతారా ?

  జగన్‌ మడమ తిప్పుతారా ?

  గన్నవరం వైసీపీలో వర్గపోరు గురించి సీఎం జగన్‌కు పూర్తి అవగాహన ఉంది. తన కేబినెట్‌ మంత్రుల ఒత్తిడితో ఎమ్మెల్యే వంశీని అదరిస్తున్నా... గతంలో ఓదార్పుయాత్ర సందర్భంగానే వీరిద్దరూ కలిసిన చరిత్ర ఉంది. దీంతో వంశీ విషయంలో జగన్‌ ఓ క్లారిటీతోనే ఉన్నారు. తన అభీష్టం మేరకు గన్నవరం బాధ్యతలను వంశీకే అప్పగిస్తున్నానని, మిగతా వారు ఆయనకు సహకరించాలని జగన్‌ ముందునుంచీ చెబుతున్నారు. అయినా వినకుండా వంశీ ప్రత్యర్ధులు ఆయనకు గోతులు తవ్వే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. తాజాగా విద్యాకానుక ప్రారంభం కోస గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన సీఎం జగన్‌.. ఎమ్మెల్యే వంశీనీ, ఆయన ప్రత్యర్ధి యార్గగడ్డ వెంకట్రావు చేతులూ కలిపారు. అయినా యార్గగడ్డలో ఎలాంటి మార్పూలేదు. మరో ఇద్దరు ప్రత్యర్ధులు దుట్టా, దాసరితో కలిసి ఆయన తాజాగా చేస్తున్న రాజకీయాలే ఇందుకు నిదర్శనం. అయినా ఈ విషయంలో జగన్‌ వెనక్కి తగ్గే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.

  English summary
  gannavaram ysrcp group politics at its peak as opponents united against mla vallabhaneni vamsi mohan amid he is undergone treatment for covid 19.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X