వైస్ జగన్ పై రాళ్ల దాడి, స్పందించిన ప్రధాని మోదీ, చంద్రబాబు, స్టాలిన్, కేటీఆర్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్ కు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై దాడి జరిగింది. వెంటనే సీఎం జగన్ ను బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు.

సింగ్ నగర్ డాబా సెంటర్ దగ్గర వైఎస్ జగన్ మీద దాడి జరగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ మీద రాళ్ల దాడి జరగడంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో వైసీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి జరగడంతో ప్రధాని నరేంద్ర మోదీతో సహ దేశంలోని ప్రముఖులు స్పందించారు. సీఎం జగన్ మీద దాడిని దేశంలోని ప్రముఖులు ఖండించారు.

PM Narendra Modi condemned the attack on Andhra Pradesh CM YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ పై దాడిని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. జగన్ పైదాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఈసీని కోరుతామని, నిర్లక్షం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాళ్ల దాడిజరగడం దారుణమని, ఆయన త్వరగా కోలుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు ఎంకే స్టాలిన్ ట్విట్ చేశారు. వైఎస్ జగన్ పై దాడిపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేటీఆర్ స్పందించారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ కోరుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్ కే రోజాతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు ఖండించారు. వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కేశినేని నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని, మంత్రి అమర్నాథ్. మేకపాటి విక్రమ్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ సీనియర్ నాయకులు ఖండించారు. అనంతరం సీఎం జగన్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్ వెంట ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు వెళ్లారు. సీఎం జగన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+