Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మానసికంగా వేధించారు: ఏసీబీ కోర్టులో అరెస్ట్ ఇలా జరిగిందంటూ చంద్రబాబు

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, మాసీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరైన సమయంలో న్యాయాధికారి హిమబిందు ఎదుట ఆయన కీలక వాంగ్మూలం ఇచ్చారు. సీఐడీ కస్టడీలో తనను పోలీసులు మానసికంగా వేధించారని, ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని చంద్రబాబు చెప్పారు.

పోలీసులు తనను ఇంటరాగేట్ చేస్తున్న దృశ్యాలను దురుద్దేశపూర్వకంగా ప్రత్యక్షప్రసారం చేయించారని, ఆ అధికారం వారికి లేదని చంద్రబాబు అన్నారు. సీఐడీ కస్టడీలో ఉండగా తనకు మొదట ఒక వైద్యుడు పరీక్షలు చేశారని, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. తనకు బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరీక్షలో తేలిందన్నారు.

police harassed me mentally, during arrest process: chandrababu explains to acb court law officer

కాగా, సెప్టెంబర్ 22 వరకు రిమాండ్‌కు పంపుతూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఇచ్చిన ఉత్తర్వుల పూర్తి కాపీ సోమవారం బయటకు వచ్చింది. కోర్టులో చంద్రబాబు ఇచ్చిన వాంగ్మూలం వివరాలు అందులో పేర్కొన్నారు. మిమ్మల్ని ఏ సమయంలో అరెస్ట్ చేశారన్న న్యాయాధికారి ప్రశ్నించగా.. తాను బస చేసిన ప్రదేశాన్ని శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి పోలీసులు ముట్టడించారని తెలిపారు చంద్రబాబు.

శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి 5.30 గంటల సమయంలో సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ్ తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారని తెలిపారు. వారి రాకకు కారణమేమిటని అడిగితే.. అరెస్ట్ నోటీసు అందించారని.. అయితే కేసు వివరాలు అడిగితే సమాధానం చెప్పలేదని చంద్రబాబు తెలిపారు.

పోలీసులు మీతో దురుసుగా ప్రవర్తించారా? అన్న ప్రశ్నకు.. శారీరకంగా ఇబ్బంది పెట్టలేదు గానీ.. మానసికంగా వేధిస్తూనే ఉన్నారని చంద్రబాబు సమాధానమిచ్చారు. కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు ఇచ్చారా? అని ప్రశ్నించగా.. మొదట ఎఫ్ఐఆర్, అరెస్ట్ నోటీసులే ఇచ్చారన్నారు. కోర్టులో హాజరుపరచడానికి కొంచెం ముందు మాత్రమే రిమాండ్ నోటీసు అందించారని చంద్రబాబు తెలిపారు.

ఎలాంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండానే తనను అరెస్ట్ చేశారని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి కాకపోయినా సీఐడీ డీఐజీ తనను ఇంటరాగేట్ చేశారని, ఆ అధికారం ఆయనకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు, చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. కరుడుగట్టిన నేరగాళ్ల మధ్య ఆయన్ను జైల్లో ఉంచడం సురక్షితం కాదన్నారు ఆయన తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా. హౌస్ అరెస్టులో ఉంచేలా ఆదేశాలివ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. అయితే, ఇంటికంటే జైలు సురక్షితమని, భద్రతా చర్యలన్నీ తీసుకున్నామన్నారు ఏజీ పొన్నవోలు సుధాకరరరెడ్డి. సీఆర్పీసీలో హౌస్ అరెస్ట్ లేదన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+