వైసీపీపై వీర్రాజు అస్త్రం గురి తప్పింది- ఆ వ్యాఖ్యలతో బూమ్ రాంగ్ : ఆత్మరక్షణలో ఏపీ బీజేపీ చీఫ్..!!

సీఎం జగన్.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో బీజేపీ ఏపీ చీఫ్ ఆత్మరక్షణలో పడ్డారు. రాజకీయంగా తన వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో బలం చాటుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ..టీడీపీ రెండు పార్టీలు బీజేపీని వ్యూహాత్మకంగా ఒకరి నుంచి మరొకరికి సంబంధం ఉందని చెబుతూ..పరోక్షంగా బీజేపీ నేతలే సమాధానం ఇచ్చుకో వాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. దీంతో..రెండు పార్టీలకు సమాన దూరమని చాటే క్రమంలో బీజేపీ నేతలు జనాగ్రహ సభలో పోటీ పడి ప్రసంగించారు.

చీప్ లిక్కర్ ధరలు తగ్గిస్తామంటూ

చీప్ లిక్కర్ ధరలు తగ్గిస్తామంటూ


అయితే, సభలో ఏపీ కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ త్వరలోనే ఏపీలో బెయిల్ పైన ఉన్న నేతలు జైలుకు వెళ్తారంటూ వ్యాఖ్యానించారు. దీని పైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ.. ప్రధాని మోదీ నిర్ణయాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు దారి తప్పాయి. ప్రధానంగా చీప్ లిక్కర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు..చెప్పిన లెక్కల పైన సొంత పార్టీ నేతలకే రుచించలేదు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సభలో చీప్ లిక్కర్ ధర తగ్గించి రూ 70కే అందిస్తామని చెప్పటం... మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలంటూ వీర్రాజు పిలుపునివ్వటం బీజేపీ నేతల్లో డైలమాకు కారణం అవుతోంది.

వీర్రాజు వ్యాఖ్యలపై విమర్శలు

వీర్రాజు వ్యాఖ్యలపై విమర్శలు


వీర్రాజు వ్యాఖ్యల పైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని మండిపడ్డారు. కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఇదే విధంగా.. ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు విసిరారు.

సొంత పార్టీలోనూ చర్చ

సొంత పార్టీలోనూ చర్చ


70 రూపాయలకి, 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు అనడం చూస్తే జాలేస్తోందని అన్నారు. అదే 70 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తాం అనే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని నిలదీశారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే సోము వీర్రాజు ఏ కలుగులో దాక్కున్నారని అడిగారు. వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని సోము వీర్రాజు ప్రధాని మోదీని ప్రశ్నించాలన్నారు.

వైసీపీని కార్నర్ చేయబోయి..గురి తప్పి

వైసీపీని కార్నర్ చేయబోయి..గురి తప్పి


కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. ఏపీలో పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత.. ఏపీలో ఎదగాలని భావిస్తున్న సమయంలో ఈ రకంగా కోటి మంది మద్యం ప్రియులు ఉన్నారని..చీప్ లిక్కర్ ధర తగ్గిస్తామని.. బీజేపీ ఓట్లు వేయమని ప్రచారం చేయటం ఏంటనే చర్చ సొంత పార్టీలోనే మొదలైంది. దీంతో..ఇప్పుడు సోము వీర్రాజు ఒక విధంగా ఆ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి సోము వీర్రాజు తన వ్యాఖ్యలను ఏ విధంగా సమర్ధించుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+