'స్పందన 'లో షాకింగ్ రిక్వెస్ట్ .. అమ్మానాన్న కోసం కిడ్నీ అమ్ముకోనివ్వండి ప్లీజ్

ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఒక యువతి అభ్యర్థన అక్కడ ఉన్న అధికారులను ఒక్కసారిగా కదిలించింది. ఆ యువతి అభ్యర్థనను విన్న వారి కళ్ళు చెమర్చేలా చేసింది. అటు అధికారులను, ఇటు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలను నివ్వెరపోయేలా చేసిన యువతి అభ్యర్థన ఏంటి ? ఆ పరిస్థితి ఆమెకు ఎందుకు వచ్చింది?

ఇక అసలు విషయానికొస్తే విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన నఫీసా తన అభ్యర్థనను అధికారులకు తెలియజేసుకోవడానికి వచ్చింది. అసలు నఫీసా అభ్యర్థన ఏమిటంటే ఓ ప్రైవేటు టెలికాం కంపెనీల ఉద్యోగం చేసే ఆమె ఉద్యోగం తల్లిదండ్రుల అనారోగ్య కారణాలతో సరిగా పని చెయ్యలేని స్థితిలో పోయింది. ఆ తర్వాత లభించక ఉద్యోగం పోవడంతో, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ఉద్యోగం రాలేదు . అసలే కష్టాల్లో ఉన్న నఫీసా దగ్గర గత ప్రభుత్వ హయాంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు 10 వేలు లంచం తీసుకుని 1100 సెంటర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఇక ఆ ఉద్యోగం సైతం రాలేదని అధికారులతో చెప్పుకుంది నఫీసా . అందుకే తన కుటుంబాన్ని పోషించుకోతానికి తన కిడ్నీ లాంటి అవయవాలు అమ్ముకుంటానని అనుమతి ఇవ్వాలని కోరింది.

 spandana program.. a young girl shocking request for selling her kidney

మంచాన పడిన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పింది. అనారోగ్యంతో ఉన్న సోదరుడు సంపాదన సరిపోకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పుల బాధ నుండి బయట పడటం కోసం తన కిడ్నీ అమ్ముకోవడానికి అనుమతించాలంటూ అభ్యర్థించింది నఫీసా.

నఫీసా అభ్యర్థనను విన్న అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు . ఆమె విజ్ఞప్తిని సబ్ కలెక్టర్ మిషా సింగ్ వారించారు . ఇక ఇది సందర్భం కాదని దీనిపై తర్వాత ప్రత్యేకించి మాట్లాడతానని నఫీసా కు చెప్పారు. అప్పుల భారం నుండి బయటపడడానికి, వృద్ధులై మంచాన పడిన తల్లిదండ్రులను చూసుకోటానికి , అనారోగ్యంతో ఉన్న అన్నకు అండగా నిలవడానికి తన కిడ్నీ వంటి అవయవాలు అమ్ముకోడానికి అధికారులు అనుమతించాలని ఆమె కోరడం అక్కడ ఉన్న వారందరినీ ఆవేదనకు గురి చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+