వంగవీటి రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా స్కూటీ; ఉలిక్కిపడిన రాధా అనుచరులు, పోలీసులు ఎంట్రీ
తనను చంపటానికి రెక్కీ నిర్వహించారని ఇటీవల వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల క్రమంలో తాజాగా వంగవీటి రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా ఉన్న ఓ స్కూటీ కలకలం రేపింది.

వంగవీటి రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పదంగా స్కూటీ
వంగవీటి రాధా ఆఫీస్ ముందు గత కొన్ని రోజులుగా అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉండడంతో రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకుని, స్కూటీ ఎవరిదన్న దానిపై దర్యాప్తు నిర్వహించారు. ఇదే సమయంలో వంగవీటి రాధా కార్యాలయాన్ని కూడా ఇంటెలిజెన్స్ మరియు ఎస్బి పోలీస్అధికారులు పరిశీలించారు. రాధా కార్యాలయం దగ్గర వివరాలను కూడా సేకరించారు. రాధా కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న స్కూటీ నాని అనే వ్యక్తికి చెందినదని పోలీసులు గుర్తించారు.

స్కూటీ తనిఖీ చేసిన పోలీసులు, స్కూటీ ఓనర్ గుర్తింపు
నానీని రాధా కార్యాలయం పక్కన ఉన్న స్వీట్ షాప్ లో పని చేసే వ్యక్తి స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు. వాహన పత్రాలను చూపించిన తర్వాత స్కూటీ తీసుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. స్కూటీ లో ఏమి లేకపోయేసరికి రాధా అనుచరులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ వంగవీటి రాధాను చంపటానికి రెక్కీ నిర్వహించారన్న వార్త మాత్రం అనుచరులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది.

వంగవీటి రాధా ను చంపే కుట్ర .. రాధా వ్యాఖ్యలతో సీఎం జగన్ ఆదేశాలు
ఇదిలా ఉంటే కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో తాజాగా వంగవీటి రాధా తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని చేసిన వ్యాఖ్యలు, హత్య రాజకీయాల ఆరోపణలు బెజవాడ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చిన్న గొన్నూరు లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్లిన రాధ కొందరు తన హత్యకు కుట్ర చేశారని, రెక్కీ కూడా నిర్వహించారని, హత్యకు కుట్ర చేసిందెవరో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే రాధాకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సెక్యూరిటీని నిరాకరించిన వంగవీటి రాధా.. దేవినేని అనుచరుడి అరెస్ట్?
వంగవీటి రాధా కు 2+2 గన్ మెన్స్ ను కేటాయిస్తున్నట్లు గా పోలీసులు వెల్లడించారు. అయితే వారిని ఆయన తిరస్కరించి పంపివేశారు. వంగవీటి రంగా అభిమానులే తనకు రక్షణ అని వంగవీటి రాధా స్పష్టం చేశారు. వంగవీటి రాధా కుటుంబానికి, దేవినేని కుటుంబానికి పాత పగలు ఉన్న నేపథ్యంలో దేవినేని అవినాష్ అనుచరుడైన అరవ సత్యం ను పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. అయితే అతను పోలీసుల విచారణలో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని చర్చ జరుగుతుంది.

రాధా వ్యాఖ్యలతో బెజవాడ పాలిటిక్స్ పై చర్చ
మరోపక్క చంద్రబాబు డిజిపికి లేఖ రాసి రాధాకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాధాకు హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. వంగవీటి రాధా ను సైతం జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మొత్తానికి బెజవాడ పాలిటిక్స్ లో వంగవీటి రాధా చేసిన కామెంట్స్, ఆ తరువాత ఆయన సెక్యూరిటీని నిరాకరించి చేస్తున్న పర్యటనలు ఆందోళనకు కారణంగా మారాయి. ముందు ముందు విజయవాడ పాలిటిక్స్ లో వంగవీటి రాధా చేసిన హత్యకుట్ర కామెంట్స్ తో మరి ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో అన్న చర్చ జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications