Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయినా.. చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు?

TDP BJP Alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.

ఇందులో భాగంగా- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిశారు. సీట్ల పంపకాలపైనా చర్చించారు. పొత్తుపై నేడో రేపో ఈ మూడు పార్టీల అధినేతలు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

TDP BJP alliance MP Kesineni Nani lashesh out at Chandrababu Naidu

చంద్రబాబు- అమిత్ షా భేటీపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాదని, నరేంద్ర మోదీ ప్రధాని కాబోరని చంద్రబాబు భావించాడని, కాంగ్రెస్‌ను కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని చంద్రబాబు ఆశపడ్డాడని వ్యాఖ్యానించారు.

మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో తనతో అవిశ్వాస తీర్మానం పెట్టించాడని నాని అన్నారు. మోదీని వ్యక్తిగతంగా చంద్రబాబు నానా తిట్లు తిట్టాడని, 2019లో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు తేరుకోలేకపోతున్నాడని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుందని, మోదీని తిట్టినందుకు కేసుల్లో ఇరికిస్తారనే భయం ఆయనను పట్టుకుందని ఎద్దేవా చేశారు.

మోదీ- అమిత్ షాను కలవడానికి గతంలోనూ చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశాడని కేశినేని నాని గుర్తు చేశారు. ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో.. తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి అని వ్యాఖ్యానించారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా గానీ, రైల్వే జోన్ గానీ కేంద్రం ఇవ్వలేదని నాని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామంటూ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్పారు. అయినా చంద్రబాబు ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడని నిలదీశారు. చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదని పేర్కొన్నారు.

జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే చంద్రబాబు.. టీడీపీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడంటూ విమర్శించారు. టీడీపీ ఆవిర్భవించిన తరువాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యిందని, తెలంగాణలోనూ ఇదే పరిస్థిితి ఉందని నాని అన్నారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ మూతపడుతుందని జోస్యం చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+