నేను విన్నాను, నేను ఉన్నాననే జగన్‌కు మహిళల గోడు వినిపించడం లేదా..?: వంగవీటి రాధా
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే జగన్‌కు మహిళల గోడు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. అమరావతి పరిధిలో ఒకే సామాజిక వర్గం ఉంటే రెండు నియోజకవర్గాల్లో వైసీపీ ఎలా గెలుస్తోందని ఆయన ప్రశ్నించారు. సామాజిక వర్గం పేరుతో రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమరావతి రాజధాని కోసం దీక్ష చేస్తున్న రైతులు, మహిళలకు రాధా సంఘీభావం తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
అమరావతి రాజధాని కోసం తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఇందులో అనుమానానికి తావులేదన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని గుర్తుచేశారు. పార్టీకో, వర్గానికి ఇవ్వలేదని స్పష్టంచేశారు. కానీ రైతులను ఇబ్బందికి గురిచేసేలా జగన్ సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శలు చేశారు.

రాజధాని కోసం 30 వేల ఎకరాల భూమి కావాలని ఇదివరకు జగన్ చెప్పింది అబద్దమా అని రాధా ప్రశ్నించారు. నిండు సభలో 30 వేల ఎకరాల భూమి కావాలని చెప్పి.. ఇప్పుడు మాట మార్చడం ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు మంత్రులు రైతులను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని నోటికొచ్చినట్టు దూషించడం తగదన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. తీరు మార్చుకోవాలని సూచించారు. అధికారం చేపట్టిన 9 నెలల్లో వైసీపీ నేతల మాటల తీరు, వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications