తెలుగువాడీ గౌరవం నిలబెట్టేందుకు కృషి, పురష్కారం బాధ్యతను పెంచింది: ఎన్వీ రమణ
తెలుగువాడిగా గౌరవాన్ని నిలపెట్టడానికి కృషి చేస్తున్నానని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్దార్ధ ఆడిటోరియంలో సీజేఐ ఎన్‌వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొనగా.. ఎన్‌వీ రమణ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పురస్కారంతో నువ్వు ఇంకా చాలా చేయాలని హెచ్చిరించినట్లు అయ్యిందని అన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందని, తనకున్న పరిమితుల మేరకు ప్రతీ ఒక్కరికీ న్యాయం అందేలా చూస్తానని అన్నారు. రోటరీ క్లబ్ సభ్యులు నా గుణగణాలను చూసి అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, వారి సేవలను కూడా అభినందిస్తున్నాను అని అన్నారు.
ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగంపై పెద్ద చర్చే జరుగుతుందని, న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని అన్నారు. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని అన్నారు. సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు.
ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియజెప్పాలని, అన్నీ వ్యవస్థల తరహాలో న్యాయవ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని, న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోతున్నామని, సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలని, చిన్నవారి నుంచి పెద్దవారు వరకు న్యాయవ్యవస్థపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదని, కోర్టుకు వస్తే అర్ధంకాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అన్నారు.

నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. భారత లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో లోప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. న్యాయ సహాయంకోసం, రాజ్యాంగ హక్కుల కోసం రోటరీ క్లబ్ సభ్యులు కొంత సమయం కేటాయించాలి. నేడు రూల్ ఆఫ్ లా అనేది చాలా ముఖ్యం. అది లేకుంటే చాలా అలజడి రేగుతుంది. మేధావి వర్గంగా ఉన్న వారంతా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియ చెప్పాలి. అన్ని వ్యవస్థల తరహాలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోతున్నాం. సమస్య వచ్చినా, హక్కులకు భంగం కలిగినా సామాన్య ప్రజలు న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. చిన్నవారు నుంచి పెద్ద వారువరకు అవగాహన పెంచుకోవాలి. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదు. కోర్టుకు వస్తే అర్ధంకాని భాషతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు. అన్నీ వారికి అర్ధం అయితేనే న్యాయస్థానం అంటే గౌరవం కలుగుతుందని ఎన్వీ రమణ అన్నారు.
కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలను జాతీయ స్థాయిలో పెంచాలి. 4.60కోట్ల కేసులో మన దేశ న్యాయ స్థానాలలో ఉన్నాయి. కేసుల విచారణ సాగుతూ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో పని చేస్తే కోర్టుకు రానవసరంలేదు. పరిధి దాటితే... కోర్టులు జోక్యం చేసుకుంటాయి.. అది అవసరం కూడా. పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా... ప్రశ్నించే తత్వం ప్రజల్లో ఉండాలి. కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయాలని భావిస్తున్నా. న్యాయమూర్తుల నియామకాలు, ఇతర ఇబ్బందులపై మాట్లాడుతూనే ఉన్నా. బెజవాడ బ్లేజ్ వాడ అంటే... సైద్దాంతిక సిద్దాంతాల వల్లే. ఎంతో చైతన్య వంతమైన ప్రాంతం విజయవాడ. 1983 నుంచి విజయవాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ఎన్వీ రమణ తెలిపారు.
ఊహించినంత గొప్పగా విజయవాడ పురోగతి సాధించలేదని ఎన్వీ రమణ చెప్పారు. అన్ని రంగాల్లో ఈ నగరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. సాంస్కృతిక, సాహిత్య రంగాలకు వేదిక విజయవాడ. నేడు అవన్నీ కనుమరుగై పోతున్నాయి. తెలుగుభాషను శిధిలం కాకుండా చూసుకోవాలి. ఇంగ్లీషు భాష నేర్చుకోండి... కానీ మాతృభాషతోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్ఠంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు జాతి గొప్ప తనాన్ని అందరకీ తెలియ చేయండి. ఇదే నేను ప్రజలకు ఇచ్చే సందేశంగా స్వీకరించాలని సూచించారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications