Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అగ్రిగోల్డ్ పై అప్పుడు వైసీపీ- ఇప్పుడు బీజేపీ-జగన్ కు సోము వీర్రాజు లేఖ

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అగ్రిగోల్డ్ కుంభకోణం బాధితులకు ఇప్పటికీ పూర్తిగా న్యాయం జరగలేదు.

విజయవాడ : ఏపీలో అగ్రిగోల్డ్ బాధితుల ఇబ్బందుల పరిష్కారం పై శ్వేత పత్రం ప్రకటించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) ఇవాళ సీఎం వైఎస్ జగన్ (ys jagan)కు బహిరంగ లేఖ రాశారు. ఇందులో ఆయన అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తరఫున అందిన సాయంపై వివరాలు కోరారు.

అధికారంలోకి వచ్చిన అరుమాసాల్లో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను న్యాయస్ధానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికలముందు వైఎస్ హామీ ఇచ్చిన విషయాన్ని సోము వీర్రాజు గుర్తుచేశారు. అయితే అధికారం వచ్చి మూడున్నర సంవత్సరాలు దాటినా ఎందుకు పరిష్కరించలేదని ఈ బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నిస్తున్నట్లు సోము తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లింపు చేయక పోవడంతో 142 మంది అకాల మృతి చెందారని సోము గుర్తుచేశారు. ఆనాడు అసెంభ్లీలో అప్పటి ముఖ్యమంత్రి మూడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానంటే మీరు 10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని చెప్పారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా అని సోము జగన్ ను ప్రశ్నించారు.

then ysrcp.. and now bjp fight on agri gold scam-somu veerraju demand jagan for white paper

పదివేలు లోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో 250 కోట్లు, 2021 ఆగస్టులో 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగిందని, అయితే ఆ తరువాత ఒక్కరికి కూడా బాండ్లు పరిష్కారం కాలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు సుమారు 14 లక్షల మంది తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు చూస్తున్నారని సీఎం జగన్ కు రాసిన లేఖలో సోము ప్రస్తావించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అగ్రిగోల్డు మదుపు దార్లకు చెల్లింపులు నోచుకోలేదని, బాధితులకు వెంటనే నగదు పరిష్కారం చేస్తానన్న ముఖ్యమంత్రి పట్టించుకోక పోవడంతో అగ్రిగోల్డు బాదితులు కన్నీటి పర్యంతంగా రోజులు వెళ్లదీస్తున్నారని సోము తెలిపారు.

20వేల లోపు అగ్రిగోల్డు బాండ్లను కూడా పూర్తిగా పరిష్కారం చేయక పోవడంతో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. ఆనాడు ఎన్నికల ముందు న్యాయస్ధానాల సమస్యలు ప్రభుత్వం చూసుకుంటుందని, అగ్రిగోల్డు అస్తులను విషయాన్ని కూడా ప్రభుత్వం చూసుకుని అగ్రిగోల్డులో మదుపు చేసిన కష్టమర్లకు అందరికీ పూర్తి న్యాయం చేస్తానన్న మాటకు వైసీపీ ప్రభుత్వం మడం తిప్పిందని సోము ఆరోపించారు. అగ్రిగోల్డు సంస్ధ ఇచ్చిన క్యాష్ రిసీప్ట్స్ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. అలాగే బాండ్లు కాలపరిమితి దాటిన తరువాత ఇచ్చిన చెక్ లను కూడా ప్రభుత్వం పరిష్కరించడంలేదన్నారు. ఈ తరహా లబ్ధిదారుల సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారని లేఖలో సీఎం జగన్ ను సోమువీర్రాజు ప్రశ్నించారు.

అగ్రిగోల్డు బాధితులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం వారి గోడు వినేందుకు ముందుకు రాకపోవడంతో సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయో లేదో తెలియని పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా అగ్రిగోల్డు సంస్ధలో పని చేసిన ఉద్యోగుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉందని సోము తెలిపారు. అగ్రిగోల్డు ఉద్యోగులు మదుపుదారులకు ఇచ్చిన ఫొటోస్టాట్ కాపీ బాండ్లను ప్రభుత్వం పరిష్కారం చేయక పోవడంతో ఈ సమస్య ఉద్యోగులు.. అగ్రిగోల్డు మదుపు దార్ల మద్య మరో సమస్య నడుస్తోందన్నారు. ఈ విషయం పైన కూడా ప్రభుత్వం పరిష్కారం మార్గం వెతకాలన్నారు. అగ్రిగోల్డు మనీ సర్క్యులేషన్ విభాగంలో పని చేసేవారందరూ వేల సంఖ్యలో నిరిద్యోగులుగా మారారు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+