ఎన్నో రాజకీయ సంఘటనలు చత్రీకరించా..! కాని ప్రత్యక్షంగా ఎప్పుడూ పాల్గొనలేదన్న వర్మ..!!
విజయవాడ/హదరాబాద్ : ఎన్నో రాజకీయ సన్ని వేశాలు చిత్రీకరించిన సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ రాజకీయ కార్యక్రమాలకు మాత్రం హాజరు కాలేదట. అమరావతిలో జరిగిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన వర్మ కొన్ని ఆసక్తికర విశయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఘట్టాలను ఎన్నో చిత్రీక రించినప్పటికి ప్రత్యక్షంగా అలాంటి కార్యక్రమానికి హాజరు కాలేదని, జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వడమే తొలి కార్యక్రమమని తెలిపారు. అంతే కాకుండా సినిమాలను పక్కకు పెట్టి కాస్త వాస్తవ ప్రపంచంలో అడుగుపెట్టినట్టు ఉందని తన అనుభవాలను షేర్ చేసుకున్నారు వర్మ.

తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైఎస్సార్‌సీపీకి ప్రజలు కట్టం కట్టారని అన్నారు. వైఎస్ జగన్ చారిత్రాక విజయం సాధించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. వైఎస్ జగన్ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్ అయిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అఖండ విజయంతో గెలిపించారని వివరించారు. వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రాంగోపాల్ వర్మ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications