ఏపీలో నకిలీ సింజెటా మందుల స్కాం - ఛేదించిన బెజవాడ పోలీసులు- 4.5 కోట్ల నకిలీ స్టాక్ స్వాధీనం
ఏపీలో భారీ స్ధాయిలో నకిలీ క్రిమిసంహారక మందులు విక్రయిస్తున్న ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సాగుతున్న ఈ భారీ రాకెట్ ను ఛేదించిన పోలీసులు.. రూ.4.5 కోట్ల రూపాయలు విలువైన స్టాక్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విజయవాడ కమిషనర్ శ్రీనివాసులు ప్రకటించారు. వీరిలో ప్రధాన నిందితులు ఇంటిదొంగలే కావడం విశేషం.
క్రిమిసంహారకమందులు, విత్తనాల తయారీ సంస్ధ అయిన సింజెంటాలో ఉద్యోగులుగా పనిచేస్తున్న కొందరు, బయటి వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ స్టాక్ ను రైతులకు విక్రయించినట్లు సొమ్ము చేసుకుంటున్నట్లు విజయవాడ పోలీసులు గుర్తించారు. గుంటూరు కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో సింజెంటా సంస్ధలో గుమస్తాగా పనిచేస్తున్న రాము, సంస్ధ గోడౌన్ మేనేజర్ గా ఉన్న అతని సోదరుడు మూర్తి ప్రధాన నిందితులుగా గుర్తించారు. వీరిద్దరూ మరికొందరితో కలిసి గుంటూరులోని ఫార్చ్యున్ హోమ్ కేర్ ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ కంపెనీ కేంద్రంగా నకిలీ ఉత్పత్తుల ప్యాకింగ్ చేస్తున్నారు. నకిలీ మందులను రైతులకు విక్రయించడంతో పాటు, సింజెంటా సంస్థకు చెందిన కాలం చెల్లిన ఉత్పత్తులను సైతం విక్రయించి వీరు భారీగా సొమ్ము చేసుకున్నారు.

హైదరాబాద్ నుండి మెటీరియల్ తీసుకొచ్చి సింజెంటా ఉత్పత్తుల పేరుతో నకిలీ మందుల చలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications