ఢిల్లీ టూ విజయవాడ నిల్వ మాంసం అక్రమ రవాణా- రైల్వేస్టేషన్లో 16 బాక్సులు స్వాధీనం..
విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు తీసుకొ్చ్చి ఎక్కువ ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను విజయవాడ రైల్వేస్టేషన్ పోలీసులు పట్టుకున్నారు.
ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న 16 బాక్సుల మటన్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన మాంసం నగరానికి దిగుమతి అయినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఓ రైలు నుంచి దీన్ని దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులను అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారాంతంలో నగరానికి అక్రమంగా మాంసం దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భారీ ఎత్తున మాంసం లభ్యమైనట్లు భావిస్తున్నారు.

Recommended Video
వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ విజయవాడలో కరోనా కారణంగా ఆదివారం మాంసం అమ్మకాలపై నిషేధం ఉంది. తాజాగా పరిస్ధితులు మారడంతో మాంసం అమ్మకాలకు అనుమతిస్తున్నారు. దీంతో అక్రమ రవాణా కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నిల్వ ఉంచిన మాంసాన్ని ఏయే హోటళ్లకు సరఫరా చేస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు రైల్వే పార్శిల్ ఆఫీసుకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications