విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ఓటర్ల నమోదులో విశాఖ నెంబర్ వన్

|
Google Oneindia TeluguNews

విశాఖ : ఓటు హక్కు ప్రాధాన్యంపై జనాల్లో అవగాహన పెరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యలు, అవగాహన కార్యక్రమాల కారణంగా చాలా మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. విశాఖ జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రెండున్నర లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది.

మచీలిపట్నం పోర్టు ,తెలంగాణకు పోతుందన్న లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన కేటిఆర్మచీలిపట్నం పోర్టు ,తెలంగాణకు పోతుందన్న లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన కేటిఆర్

లక్షా 81వేల కొత్త ఓటర్లు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించి 1,81,189 మంది కొత్తవారికి ఓటుహక్కు కల్పించామని విశాఖ కలెక్టర్ కె. భాస్కర్ చెప్పారు. మరో 90వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. కొత్తగా చేరిన వారితో కలుపుకుని విశాఖ ఓటర్ల సంఖ్య 34,61,217కు చేరింది. ఈ నెల 25న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు.

1.8 lakh first-time voters added to electoral roll

18-25 ఏళ్ల వయసు గల ఓటర్లు 30 శాతం
కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిలో అందరూ 18 - 19 ఏళ్ల వయసువారు కాదని కలెక్టర్ ప్రకటించారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల యువత 20 నుంచి 30శాతం మంది ఓటర్లుగా నమోదయ్యారని, మిగతా వారంతా వివిధ వయసుల వారని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ఈసీ చేపట్టిన అవగాహన కార్యక్రమాల వల్లే ఈ స్థాయిలో కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదుచేసుకున్నారని అభిప్రాయపడ్డారు.

English summary
Visakhapatnam district is likely to see a good number of first-time voters in the coming elections. Awareness drives held recently had elicited a positive response, resulting in enrolment of 1.91 lakh new voters in the last two months, the officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X