విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా వైరస్ : జ్వరంతో విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురు.. చెస్ట్ ఆసుపత్రికి తరలింపు..

|
Google Oneindia TeluguNews

మలేషియా నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దిగిన ఐదుగురికి అక్కడే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. టెస్టుల్లో వారికి స్వల్ప జ్వరం ఉన్నట్టు తేలడంతో చెస్ట్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు,కుమార్తె ఉన్నారు. వీరు సింగపూర్,మలేషియా వెకేషన్‌కి వెళ్లి విశాఖకు చేరుకున్నారు. మరో ఇద్దరు బహ్రెయిన్ నుంచి వచ్చారు. ఈ ఐదుగురి శాంపిల్స్‌ను హైదరాబాద్,పుణే ల్యాబ్స్‌కు పంపించారు. ఇప్పటివరకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో 4300 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు.

కరోనా ఎఫెక్ట్ : గాంధీలో వద్దు.. ఆ వార్డును తక్షణమే తరలించాలని జూడాల డిమాండ్.. కరోనా ఎఫెక్ట్ : గాంధీలో వద్దు.. ఆ వార్డును తక్షణమే తరలించాలని జూడాల డిమాండ్..

ఇప్పటికైతే ఏపీలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. 11 మంది అనుమానితుల శాంపిల్స్‌ను పరీక్షంచగా... అందరికీ అందరికీ నెగటివ్‌‌గా నిర్దారణ అయింది. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ బులెటిన్ కూడా విడుదల చేసింది. విదేశాల నుంచి వచ్చిన 8 మంది శాంపిల్స్‌ను పుణే ల్యాబ్‌కు పంపించామని చెప్పింది.సింగపూర్‌, బహ్రెయిన్‌ నుంచి వచ్చిన ఐదుగురికి విశాఖ ఛాతి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో, దక్షిణ కొరియా నుంచి వచ్చిన వ్యక్తికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది.

5 people reach Vizag with fever, taken to quarantine ward in chest hospital

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Corona Virus | ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి! | Oneindia Telugu

జర్మనీ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి విజయవాడ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. మస్కట్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు పేర్కొంది. కరోనా వైరస్ పట్ల పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నామని.. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో మందులు, మాస్కులు అవసరమైన మేర నిల్వ ఉంచినట్టు వెల్లడించింది. రాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను కూడా రంగంలోకి దించామని చెప్పింది. కరోనా పర్యవేక్షణకు 24గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.

English summary
Five people, including father, daughter and wife, have arrived in Vishakhapatnam from Malaysia. They have been shifted to the AP Chest Hospital quarantine ward after being detected with mild fever upon arrival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X