విశాఖ కేజీహెచ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?
విశాఖపట్నం: కేజీహెచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బేబీ శివలక్ష్మి కేజీహెచ్‌లో చివరి సంవత్సరం చదువుతోంది.
మరో మూడు నెలల్లో కోర్సు ముగిసిపోనుండగా ఈ ఘోరం జరగడంతో శివలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భోధనేతర సిబ్బంది వేధింపుల కారణాంగానే శివలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
నిన్న ఉదయం తమతో ఫోన్లో బాగానే మాట్లాడిందని.. ఇవాళ ఉదయం ఈ వార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. శివలక్ష్మి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థిపై కత్తులతో దాడి
నెల్లూరు జిల్లా కోవూరు వద్ద హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో దాడులు చేసుకోవడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంనకు చెందిన అవినాష్, ప్రమోద్‌లు కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డారు. స్పృహతప్పి రోడ్డుపక్కన పడిపోయిన విద్యార్థులను గమనించిన కొందరు వాహనదారులు కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎస్పీ రాఘవరెడ్డి, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై కృష్ణారెడ్డి ఘటనపై ఆరా తీశారు.
అంబాజీపేటలో విషాదం
తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొట్టింది. అంబాజీపేట గ్రంథాలయం సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
తీవ్రగాయాలపాలైన భర్త మాకు శ్రీనివాస్(30) అక్కడికక్కడే మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. అమలాపురం ఆస్పత్రిలో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ దంపతులది ముమ్మిడివరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications